గోవాలో జరిగిన ఘటన.. ఇది కరెక్టేనా? వీడియో చూసి మీరే చెప్పండి

రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి, తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాంటించండి, పాటించండి అంటూ ప్రభుత్వాలు చబుతూనే ఉన్నాయి. వాటితో మాకు ఏ మాత్రం సంబంధం లేదు అని కొందరు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది కేవలం అలాంటి వారికి మాత్రమే కాదు, రోడ్డుపై ఉన్న ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇటీవల ఒక టూరిస్ట్ ట్రాఫిక్ రూల్స్ పక్కన పెట్టి కారును డివైడర్ మీదుగా డ్రైవ్ చేసి అటువైపు నుంచి ఇటువైపు రోడ్డు మీదికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఓ వ్యక్తి టయోటా ఫార్చ్యూనర్‌ కారును యూ టర్న్ చేయడానికి డివైడర్ దాటాడు. అయితే ఆ సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాలను చూడవచ్చు. నిజానికి ఆ వ్యక్తి ఆ ప్రదేశంలో యూ టర్న్ తీసుకోకూడదు. ఎందుకంటే అది యూ టర్న్ పాయింట్ కాదు. అయినప్పటికీ ఆ వ్యక్తి రూల్స్ అతిక్రమించి రోడ్డు దాటాడు.

Tourist Drives Toyota Fortuner And Jumps Divider

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డుపైన వాహనాలు రద్దీగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఆలా చేయడం సరికాదు. అది ప్రమాద హేతువు కూడా. అనుకోకుండా ఏదైనా వాహనం వేగంగా వచ్చి ఢీకొంటే అప్పుడు జరిగే ప్రమాదం ఎలా ఉంటుందో ఎవ్వరైనా ఊహించవచ్చు. ఆ సమయంలో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

టయోటా ఫార్చ్యూనర్‌ యూ టర్న్ చేసి ఇటువైపు రోడ్డు మీదికి వచ్చేసారు. ఈ ఘటనలో ఎవరికీ.. ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన గోవాలో జరిగినట్లు తెలుస్తోంది. గోవా పోలీసులు దీనికి కారణమైన డ్రైవర్ మరియు అద్దెకు ఇచ్చిన కంపెనీ మీద కూడా జరిమానా విధించినట్లు సమాచారం. గోవాలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.

Tourist Drives Toyota Fortuner And Jumps Divider

డివైడర్ మీదుగా కారును డ్రైవ్ చేసిన వ్యక్తికి రూ. 500 జరిమానా విధించినట్లు సమాచారం. డ్రైవర్ హర్యానాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి టయోటా ఫార్చ్యూనర్‌ కారును అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి సంబంధించిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు. కొందరు కారును డ్రైవ్ చేసిన వ్యక్తికి మరింత ఎక్కువ జరిమానా విధించాలని చెబుతున్నారు.

గతంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో హ్యుందాయ్ ఐ20 డ్రైవర్ రోడ్డుపైన ఇతర కార్లను ఢీకొట్టి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి పట్టుబడిన తరువాత కూడా ఏ మాత్రం భయపడకుండా నడిరోడ్డుపైనే పెద్ద స్పీకర్ పెట్టి డ్యాన్స్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. బహుశా ఆ వ్యక్తి మద్యం తాగి ఉండవచ్చు లేదా ఏదైనా ఇతర మారక ద్రవ్యాలను సేవించి ఉండవచ్చని భావించారు.

భారతదేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాలైతే.. మరికొన్ని నిర్లక్ష్యాల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా రోడ్డుపై వాహనాల డ్రైవ్ చేయడం వల్ల వారు మాత్రమే కాకూండా ఇతరులు కూడా ప్రమాదాల్లో చిక్కుకునేలా చేస్తున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలని పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు ఆకతాయిలు మాత్రం.. ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2024, 12:30 [IST]
English summary
Tourist drives toyota fortuner and jumps divider in goa
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+