మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

భారతదేశంలో రాజ్యాంగ బద్దమైన పదవులలో ఉన్నవారికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. పదవులలో ఉన్న వారి రక్షణలో భాగంగా తమకు ఎస్కార్ట్ అందిస్తారు. ఈ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉంటాయి. ఈ కాన్వాయ్ లో మంత్రులు మొదలైన వారు ప్రయాణిస్తారు. ఏ మంత్రి కాన్వాయ్ అయినా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు, ట్రాఫిక్ కొంత సమయం నిలిపివేయబడుతుంది.

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

అత్యవసర సమయాల్లో ప్రయాణించే ఈ అధికారుల వాహనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, మిగిలిన వాహనాలను నిలిపివేస్తారు. కావున ఏ వాహనం మంత్రి కాన్వాయ్ ని అధిగమించి (ఓవర్ టేక్) ముందుకు వెళ్లకూడదు. ఈ విధంగా చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

ఇలాంటి సంఘటన ఇటీవల ఒడిస్సాలో వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం 5 మంది పర్యాటకులు ఎన్‌హెచ్ -16 రహదారిలో రాష్ట్ర మంత్రి అయిన "ప్రతాప్ చంద్ర సారంగి" కారును ఓవర్ టేక్ చేశారు. ఈ కారణంగా ఆ 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

ఇందులో సంతోష్ షా, అతని భార్య, సోదరుడు మరియు ఇద్దరు మైనర్ పిల్లలు బాలసోర్ జిల్లాలోని పంచలింగేశ్వర్ నుండి కోల్‌కతాకు రెండు వాహనాల్లో తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కొంతసేపటి తర్వాత వీరిని వదిలిపెట్టారు.

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

బస్తా సమీపంలో ఎన్‌హెచ్-16 లో ప్రయాణిస్తున్నప్పుడు, తాము ఒక సైరన్ విని, అది అంబులెన్స్ అనుకుని దానిని దాటి ఉందుకు వచ్చాము. అయితే, తరువాత అది పైలట్ వాహనంతో ఉన్న మంత్రి కారు అని మేము గ్రహించాము, కొంత సమయం తర్వాత పైలట్ కారు రహదారి నుండి 'కాచా' రహదారికి వెళ్లింది, అప్పుడు మేము వారిని అధిగమించామని సంతోష్ షా వివరించాడు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

సమాచారం ప్రకారం, మంత్రి పైలట్ కారు పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న జలేశ్వర్ లోని లఖన్నాథ్ టోల్ గేట్ వరకు 20 కిలోమీటర్ల దూరం రెండు వాహనాలను వెంబడించి బస్తా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చింది, తరువాత వారిని ఐదు గంటలు అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

సమావేశంలో పాల్గొనడానికి మంత్రి బస్తాలో ఉన్నారు. ఎస్కార్ట్ లోని రెండు వాహనాలను తన కారును అధిగమించిన తరువాత, వాటిని పట్టుకుని తిరిగి తీసుకురావాలని మంత్రి పైలట్ వాహనాన్ని కోరారు. పైలట్ కారు రెండు వాహనాలను బస్తా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చింది.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

ఈ విషయం గురించి సమాచారం ఇస్తూ, ఐఐసి బస్తా పోలీస్ స్టేషన్, అశోక్ నాయక్ మాట్లాడుతూ "రెండు వాహనాల ద్వారా మంత్రి కారును అధిగమించిన కేసు నమోదు చేయబడింది.

మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

మేము మంత్రి వాహనాన్ని అధిగమించడం మా తప్పు, కానీ మంత్రి వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం తప్పు అని తమకు తెలియదని సంతోష్ షా తెలిపాడు. అయితే మళ్ళీ ఇటువంటి చర్యకు పాల్పడకూడదని వారిని వదిలిపెట్టారు. ఏది ఏమైనా అధికారుల కాన్వాయ్ ఓవర్ టేక్ చేయడం చాలా నేరం. కావున ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై వాహనాలను డ్రైవ్ చేయాలి.

MOST READ:చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే

Source: India Today

Most Read Articles

English summary
Tourists Arrested For Overtaking Minister Vehicle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X