video viral కదులుతున్న కారుపై ప్రమాదకర స్టంట్స్.. వారెంత ప్రమాదంలో ఉన్నారంటే?
గోవా భారత్‌లోనే ప్రసిద్ది గాంచిన పర్యటక ప్రాంతం. ఆ రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం పర్యటకం నుంచే సమకూరుతుంది. ఇక గోవా అంటే బీచ్‌లో షికార్లు, పార్టీలు సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే గోవాలో పర్యటకులు చేసిన ప్రమాదకర విన్యాసాలు చాలాసార్లు వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది.
గోవా బీచ్‌లలో కారు డ్రైవింగ్, రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసి పోలీసులకు చిక్కిన ఘటనలు గతంలోనూ అనేకం ఉన్నాయి. అయితే తాజాగా గోవా వీధుల్లో కారులో యువతి, ఇద్దరు యువకులు చేసిన ప్రమాదకర ప్రయాణం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోవా వీధుల్లో మారుతి వ్యాగన్‌ఆర్ కారుపైన ఓ యువకుడు కూర్చున్నాడు. కారు కుడివైపు విండోపైన మరో యువతి కూర్చొని ప్రయాణం చేస్తోంది. వీరితోపాటు మరో యువకుడు కూడా ఎడమవైపు కారు విండోపైన కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నాడు. వీరి చేతుల్లో మద్యం సీసాలు ఉన్నాయి. వీరి కారు వెనుక ప్రయాణం చేసిన ఓ బైక్ రైడర్ ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు పర్యటకులా లేదా స్థానికుల తెలియలేదు. కిటీకీల నుంచి బయటకు కూర్చున్న ఇద్దరు, కారు రూఫ్‌పైన కూర్చున్న మరో యువకుడు స్టంట్స్ ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీరు కారుపై స్టంట్స్ చేస్తున్న సమయంలో చిన్న రోడ్డుపై వాహనం కూడా అధిక వేగంతో ప్రయాణం చేస్తోంది.

కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేస్తే వీరికి తీవ్రగాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. వెనుక వైపు వచ్చే వాహనాలను గుర్తించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మిర్రర్‌కు అడ్డుగా ఉన్నారు. ఫలితంగా వెనుక వచ్చే వాహనాలను గుర్తించేందుకు అవకాశం లేదు. ఇది కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.
కారు విండోల వద్ద ఉన్న యువతి, యువకుడి కంటే వాహనం రూఫ్‌పైన కూర్చున్న యువకుడు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాడు. కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేస్తే.. రూఫ్‌పైన ఉన్న యువకుడు ముందుకు విసిరివేయబడే అవకాశం ఉంటుంది. ఫలితంగా తీవ్రంగా గాయపడే అవకాశం సహా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను పబ్లిక్ రోడ్లపైన చేయడం కారణంగా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియలేదు. అయితే ఇలాంటి ఘటనపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా...ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








