రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా, చాలా మంది ప్రజలు ప్రజా రవాణాలో ప్రయాణించడానికి వెనుకాడుతున్నారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రజలు సొంత వాహనాలలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా ఎక్కువమంది వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా మంచికే అనుకున్నా, ఎక్కువ ట్రాఫిక్ కి కారణమవుతుంది.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

ప్రజలు సొంత వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండంతో ట్రాఫిక్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ట్రాఫిక్ పోలీసులకు ఎక్కువ పని భారం పెరిగింది. అంతే కాకుండా ఇది పెద్ద తలనొప్పి సమస్యగా మారిపోయింది. ట్రాఫిక్ ఏర్పడటానికి ప్రధాన కారణం వాహనాలను సరిగ్గా పార్క్ చేయకపోవడం.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. ట్రాఫిక్ రద్దీ వల్ల భారతదేశంలోని చాలా నగరాలు ఇబ్బందిపడుతున్నాయి. దాదాపు చాలా నగరాల్లో, వాహనదారులకు సరైన పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. కావున ఒక వాహనానికి మరొక వాహననానికి కొంత కూడా ప్లేస్ లేకుండా పార్క్ చేస్తున్నారు.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

ఇది మాత్రమే కాకుండా చాలామంది వాహనదారులు పార్కింగ్ చేయడానికి తగిన స్థలం లేకుండా పోవడం వల్ల నో పార్కింగ్ లో పార్క్ చేస్తున్నారు. వాహనాలను ఈ విధంగా పార్కింగ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతోంది. కొన్నిసార్లు ఇలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతాయి. ఈ కారణంగానే ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేసిన వాహనాలపై చర్యలు తీసుకుంటారు.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

సాధారణంగా వాహనాలు నో పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసినప్పుడు అటువంటి వాహనాలను టోవింగ్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అయితే ఇటీవల ఒక బైక్ రైడర్ బైక్ మీద కూర్చుని ఉన్నప్పుడే ఆ బైక్ తీసుకెళ్లే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

నివేదికల ప్రకారం ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని నగరం పూణేలోని నానా పేట్ ప్రాంతంలో జరిగింది. ట్రాఫిక్ జామ్‌లను క్లియర్ చేయడంలో పూణేలోని పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో, రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను టోయింగ్ వాహనంలోకి ఎత్తివేశారు. ఆ సమయంలో బైక్ రైడర్ బైక్ మీద కూర్చున్నాడు. అతను బైక్ నుండి దిగేందుకు ప్రయత్నించినప్పటికీ, ట్రాఫిక్ పోలీసులు అతడిని కిందకు దించి, బైక్‌ను టోయింగ్ వాహనం లోపల పెట్టారు.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

ఆ బైక్ రైడర్ ఆ ప్రాంతంలో ఎప్పుడూ బైక్ పార్క్ చేయలేదని అప్పుడే అక్కడికి వచ్చి కూర్చున్నానని చెప్పాడు, అయితే పోలీసులు అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

నివేదికల ప్రకారం ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, నో-పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన ఏదైనా వాహనం, యజమాని పక్కన నిలబడి ఉన్నా, అది ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కావున టోవింగ్ సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించారు.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

సాధారణంగా రోడ్డుపై పార్కింగ్ లేని పక్షంలో, ఆ ప్రదేశంలో నో పార్కింగ్ అనే బోర్డు ఉంచాలి. ఇటువంటి బోర్డులు తరచుగా రద్దీగా ఉండే రోడ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో ఉంచబడతాయి. ఈ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయకూడదు. అయితే కొన్ని ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డ్స్ ఉండవు. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తీసుకెళ్తుంటారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల ముంబై పోలీసులు నో-పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఉన్న ఒక తల్లి తన బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న సమయంలో కూడా కారును లాక్కుంటూ తీసుకెళ్లిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వాహనాలను తీసుకెళ్లే టోవింగ్ సిబ్బంది వాహనాలను చాలా నిర్లక్ష్యంగా తీసుకెళ్లారని ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి.

రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్

వాహనాలను లాగుతున్నప్పుడు, ద్విచక్ర వాహన బంపర్‌లను విచ్ఛిన్నం చేయడం మరియు అద్దాలను పాడు చేయడం వంటివి టోవింగ్ సిబ్బంది అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అంతే కాకుండా బెంగళూరు నగరంలో పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన వాహనాలను కూడా తీసుకెళ్తున్నారనే ఆరోపణలు కూడా టోవింగ్ సిబ్బందిపై ఉన్నాయి.

Note: ఈ ఆర్టికల్ లో మొదటి మూడు ఫోటోలు మినహా మిగిలినవి కేవలం అవగాహనా కోసం మాత్రమే

Most Read Articles

English summary
Towing people tows bike with the owner video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X