వీడియో: టొయోటా ఆయ్గో ఇన్విజబల్ డ్రైవర్ ప్రాంక్
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ప్రాంక్స్ ఎక్కువైపోతున్నాయి. కొందరు సరదాగా ఇతరులను నవ్వించేందుకు ప్రాంక్ వీడియోస్ తయారు చేస్తుంటే, మరికొందరు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రాంక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం టొయెటా ఓ సరదా ప్రాంక్ చేసి, పనిలోపనిగా తమ కారును కూడా ప్రమోట్ చేసుకుంది.
మీరు హాలీవుడ్ సినిమా 'హెర్బీ' చూసున్నట్లయితే, ఇక్కడ టొయోటా ఏం చేయబోతుందో మీకు అర్థమైపోతుంది. టొయోటా ఆయ్గో మరియు ఇంటర్నెట్ ప్రాంకస్టర్ రాహత్ కలిసి ఓ ఫన్నీ ఇన్విజిబల్ డ్రైవర్ లెస్ కార్ ప్రాంక్ వీడియోను తయారు చేశారు. ఇందులో ఆయ్గో కారులో డ్రైవర్ సీట్ కవర్ ఆకారంలో దుస్తులు ధరించి, కారులో కూర్చుంటాడు.
ఈ దుస్తులు కారు ఇంటీరియర్‌తో మ్యాచ్ అయిపోతాయి, తొలిచూపులో ఎవరైనా కారులోకి చూస్తే, కారులో డ్రైవర్ లేడనిపిస్తుంది. వాస్తవానికి డ్రైవర్ కార్ సీట్ దుస్తులలో ఉంటాడు, ముఖానికి నల్లటి/పారదర్శక పొర ఉంటుంది. చేతులకు కూడా నల్లటి గ్లౌజ్‌లు ధరించి కారును నడుపుతాడు. కారును స్లో చేసే సమయంలో చేతులను సీట్ కవర్ దుస్తుల లోపలకి మడిచేస్తాడు.
ఇదంతా ప్రత్యక్షంగా చూసేవారికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆన్‌లైన్ ప్రేక్షకులకు మాత్రం సరదాగా అనిపిస్తుంది. మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దామా..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/uxRUBPDN-tU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








