ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కంపెనీ యొక్క కామ్రీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సెడాన్ కార్లలో ఒకటి. ఈ టయోటా కామ్రీ ప్రీమియం క్వాలిటీ సెడాన్. కావున ఈ కారణంగానే ఇది ప్రపంచంలోని చాలా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ కారు భారత మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుంది.

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

టయోటా కామ్రీ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీతో మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఈ కారు ఏషియన్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సొంతం చేసుకుంది. సేఫ్టీ పరంగా 5 స్టార్స్ పొందిన ఈ టయోటా కామ్రీ ఇటీవల ఒక ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

క్రాష్ అయిన టయోటా కామ్రీ రెండు భాగాలుగా విరిగిపోయి దాని అసలు రూపాన్ని గుర్తించనంత దారుణంగా ఉంది. దీనిని మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రమాదంలో ఇంత భయంకరంగా విరిగిన ఈ కారుకి ఏసియా ఎన్‌సిఎపి సిస్టం 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

ఈ దృశ్యాన్ని గమనించిన టయోటా కామ్రీ వినియోగదారుల గుండెలు ఒక్కసారిగా గుబేల్ మన్నాయి. ఇది వాహన వినియోగదారులకు పెద్ద ఆందోళనను రేకెత్తించింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ అని తేలింది

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు ఇంతగా ఎలా ప్రమాదానికి గురైందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియదు. ఈ కారు కలిగి ఉన్న చాలామంది వినియోగదారులలో రకరకాల సందేహాలు పుడుతున్నాయి.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

సాధారణంగా ఏదైనా ఒక క్రాష్ టెస్ట్ లో వాహనాన్ని ఒక నిర్దిష్ట వేగంతో పరీక్షిస్తారు, ఏసియా ఎన్‌సిఎపి టెస్టులో, టయోటా కామ్రీ గంటకు 65 కిమీ వేగంతో టెస్ట్ చేయబడింది. ఈ టెస్ట్ లో టయోటా కామ్రీ ప్రదర్శించిన సామర్థ్యం ఆధారంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది.

ఏదైనా ఒక వాహనం అది పొందిన రేటింగ్ మాత్రమే కాకుండా నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లినట్లైతే కారు అనుకోని పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కావున ఈ సంఘటన నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తే సురక్షితం కాదని రుజువు చేస్తోంది.

MOST READ:తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో టయోటా కామ్రీ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 40.59 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 2.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 218 బిహెచ్‌పి పవర్ మరియు 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Toyota Camry Which Got 5 Star Rating For Safety Split Into Two Pieces. Read in Telugu.
Story first published: Tuesday, May 25, 2021, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X