ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, గుజరాత్‌లోని ఓ టొయోటా డీలర్ ప్రత్యేకమైన చొరవను ప్రారంభించాడు. వాస్తవానికి, ఈ డీలర్ 200 టయోటా ఇన్నోవా ఎమ్‌పివిలను అంబులెన్స్‌గా మార్చి, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆసుపత్రులకు సరసమైన ధరలకే అందించాలని నిర్ణయించాడు.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

ప్రత్యేకంగా రూపొందించిన ఈ అంబులెన్సులను గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన రేటుకు ఉపయోగించుకునేలా చేస్తామని సదరు డీలర్‌షిప్ ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన టొయోటా డీలర్ 'ఇన్ఫినియం టొయోటా' అందిస్తున్న ఈ ఇన్నోవా అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్, స్ట్రెచర్ మరియు అనేక ప్రాణాలను రక్షించే పరికరాలను కలిగి ఉంటాయని ప్రకటించింది.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి ధర రూ.24.5 లక్షలు అని డీలర్‌షిప్ తెలిపింది. ప్రతి ఎమ్‌పివిని అంబులెన్స్‌గా మార్చడానికి రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షలు ఖర్చవుతుందని వివరించింది. ఇలా రూపొందించిన టొయోటా ఇన్నోనా ఎమ్‌పివిలపై సబ్సిడీ అందిస్తామని ఇన్ఫినియం టొయోటా డీలప్‌షిప్ పేర్కొంది.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

సబ్సిడీ అనంతరం, టొయోటా ఇన్నోవా అంబులెన్స్ ధర రూ.20.6 లక్షలుగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ అంబులెన్స్‌లను స్పాన్సర్ చేయవచ్చని డీలర్‌షిప్ తెలిపింది. వీటిని ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలు, ఎమ్మెల్యేలు లేదా ఎంపీలకు అప్పగించవచ్చని వివరించింది.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

ఈ విషయంపై ఇన్ఫినియం టొయోటా ప్రెసిడెంట్ అజిత్ మెహతా మాట్లాడుతూ, "జిల్లా స్థాయి ఆసుపత్రుల వైద్యులు మరియు నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తరువాత, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 రోగులను రవాణా చేయడానికి అంబులెన్స్‌ల అవసరం చాలా ఉందని తాము గమనించామని, ఇందులో భాగంగానే, ఈ ప్రత్యేకమైన అంబులెన్సుల ద్వారా తాము ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ఈ పోరాటంలో సహకరిస్తున్నామని" అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

టొయోటా అంబులెన్సుల కోసం ఇన్ఫినియం టొయోటా తమ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపిలను సంప్రదించడం ప్రారంభించింది మరియు వారిలో కొందరు ఈ చొరవను సద్వినియోగం చేసుకోవడానికి సుముఖత చూపించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

అహ్మదాబాద్ వెస్ట్ ఎంపి కిరిట్ సోలంకి మాట్లాడుతూ "గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అంబులెన్సులు అవసరం చాలా ఉందని, కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ఇన్ఫినియం టొయోటా యొక్క ఈ ప్రయత్నం గ్రామీణ ప్రజలకు ఎంతో సహాయపడుతుందని" అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్‌తో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి అనేక ఆటోమొబైల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఆక్సిజన్ సిలిండర్లు లేదా వైద్య పరికరాలను అందించడంలో ఆటో పరిశ్రమ చాలా సహాయపడింది. ఇటీవల హ్యుందాయ్, ఎమ్‌జి మోటార్, మారుతి సుజుకి మరియు నిస్సాన్ వంటి సంస్థలు కరోనాకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించాయి.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

ఇదిలా ఉంటే, టొయోటా భారతదేశంలో కొరోల్లా క్వెస్ట్ పేరుతో ఓ కొత్త పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ నేపథ్యంలో, కంపెనీ ప్రస్తుత కొరోల్లా అమ్మకాలను పూర్తిగా నిలిపివేసే అకాశం ఉంది. టొయోటా కరోలా క్వెస్ట్ మారుతి సుజుకి నుండి పునర్నిర్మించిన కారు కావచ్చునని కూడా విశ్వసిస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు మరియు ఆస్పత్రుల కోసం ఇన్నోవా అంబులెన్స్‌లు!

అదే సమయంలో, టొయోటా కరోలా క్వెస్ట్ బ్యాడ్జ్‌పై కంపెనీ నిలిపివేసిన కొరోల్లా ఆల్టిస్‌ను తిరిగి ప్రారంభించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మారుతి సుజుకి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్‌ను టొయోటా బెల్టాగా ప్రవేశపెడతారని కూడా ఊహించబడింది. కానీ కంపెనీ ఇంకా దీనిని ధృవీకరించలేదు.

Most Read Articles

English summary
Toyota Dealer In Gujarat Offers 200 Custom Made Innova Ambulances To MLA, MPs And Hospitals. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X