టయోటా ఫార్చ్యూనర్‌ కారులో టాయిలెట్‌, జెట్‌ స్ప్రే.. అద్భుతమైన మోడిఫికేషన్స్‌ అంటే ఇవేనేమో.!!

భారత మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న ఎస్‌యూవీల్లో టయోటా ఫార్చ్యూనర్‌(Toyota Fortuner) ఒకటి. చాలా కాలంగా మార్కెట్లో కొనసాగుతూ విపరీతంగా ప్రజాదరణ పొందుతోంది. లో కాస్ట్‌ మెయింటెనెన్స్‌, ఎలాంటి రోడ్లపై అయినా అనుకూలమైన డ్రైవింగ్‌ టయోటా ఫార్చ్యూనర్‌ సొంతం. అందుకే ఇన్నేళ్లుగా మార్కెట్లో పాతుకుపోయింది.

ఈ నేపథ్యంలో కస్టమర్లు కూడా ఎక్కువగా కారును తమకు నచ్చినట్లుగా రీ మోడల్‌ చేసేందుకు టయోటా ఫార్చ్యూనర్‌ను ఎంచుకుంటారు. ఫోర్డ్‌ ఎండీవర్‌, ఎంజీ గ్లోస్టర్‌ లాంటి విదేశీ బ్రాండ్‌ కార్లతోనూ ఫార్చ్యూనర్‌ పోటీ పడుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇటీవల ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్‌ కారులో టాయిలెట్‌ అరేంజ్‌ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Toilet-In-Toyota-Fortuner

కారు డ్రైవింగ్‌ చేసేటప్పుడు టాయిలెట్‌(Toilet System In Toyota Fortuner)కి వెళ్లాల్సి వస్తే.. కారు ఆపి పబ్లిక్‌ టాయిలెట్‌కి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే హైవేలపై వెళ్తున్నప్పుడు ఖాళీ ప్రాంతాలు చూసుకుని వెళ్లాలి. ట్రైన్‌లో ఉన్న సౌకర్యాల మాదిరిగా కారులో ఈ ఫెసిలిటీ ఉండదు. ఇది కష్టంగా భావించాడేమో ఓ వ్యక్తి.. ఏకంగా తన కారులోనే టాయిలెట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి దాని ప్రత్యేకతలు పంచుకున్నాడు.

టయోటా ఫార్చ్యూనర్‌ రీ మోడలింగ్‌ వీడియో ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాందించుకుంది. అయితే ఇందులోని మార్పుల గురించి ముఖ్యమైన విషయానికొస్తే.. ఈ SUV నిర్మాణంలో అసలు మార్పులు చేయలేదు. క్యాబిన్‌ లోపలికి అడుగుపెట్టినప్పుడు మాత్రమే మీరు అందులో పెద్ద మార్పులు చూడవచ్చు.

Toilet-In-Toyota-Fortuner

అయితే టయోటా ఫార్చ్యూనర్‌ కారులో యజమాని టాయిలెట్‌తో పాటు ఇందులో జెట్‌ స్ప్రేని కూడా ఏర్పాటు చేశఆరు. ఇదే ఇందులో ప్రధాన హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. టాయిలెట్‌, జెట్‌ స్ప్రే ఏర్పాటు చేసేంత స్థలం కారులో ఉందా అని.. యజమాని కారు క్యాబిన్‌లో స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాయిలెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

టయోటా ఫార్చ్యూనర్‌ విశాలమైన SUV. మూడు వరుస (7 సీటర్‌) సీట్లతో దీనిని స్టాండర్డ్‌గా రూపొందించారు. యజమాని ఇందులో టాయిలెట్‌ను నిర్మించడం వల్ల.. క్యాబిన్‌లో పెద్దగా మార్పులు చేసినట్లుగా అనిపించదు. ఎందుకంటే టాయిలెట్‌కు వెళ్లాలి అనుకున్నప్పుడు.. మూడవ వరుస సీట్లలో ఒకదానిని ఫోల్డ్‌ చేసుకోవచ్చు. లెగ్‌ రూమ్‌, హెడ్‌ రూమ్‌, షోల్డర్‌ రూమ్‌ అన్నీ అలాగే ఉన్నాయి.

Toilet-In-Toyota-Fortuner

టయోటా ఫార్చ్యూనర్‌ SUV లో టాయిలెట్‌ నిర్మాణంతో కారు బరువులో మాత్రం మీరు మార్పును చూడవచ్చు. బూట్‌ స్పేస్‌ విభాగంలో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు దుర్వాసన రాకుండా జెట్‌ స్ప్రేని కూడా వినియోగించుకునేలా రూపొందించుకున్నారు. ఏదేమైనా ఇలాంటి క్రియేటివీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..

కాగా టయోటా ఫార్చ్యూనర్‌ దేశీయ మార్కెట్లో రెండు పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అవి 2.7 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్ ఆప్షన్‌. 2.7 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌.. 164 bhp, 245 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌.. 201 bhp, 420 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 15, 2023, 17:22 [IST]
English summary
Toyota fortuner gets toilet built inside along with jet spray video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+