140 కి.మీ వేగంతో ట్రక్కును ఢీకొట్టిన టయోటా ఫార్చ్యూనర్‌.. తెరుచుకోని ఎయిర్‌బ్యాగ్‌లు.. కారణమిదేనా?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. అనుమతించిన దానికంటే అధిక వేగంతో ప్రయాణం చేయడం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం సహా నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

తాజాగా టయోటా ఫార్చ్యూనర్‌ (Toyota Fortuner hits truck), ట్రక్‌ ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం సమయంలో వాహన వేగం 140 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఫార్చ్యూనర్‌ కారులోని ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోలేదని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎయిర్‌బ్యాగ్స్‌లు తెరుచుకోకపోయినా.. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Toyota Fortuner hits truck

ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జాతీయరహదారిపై చోటుచేసుకుంది. టయోటా ఫార్చ్యూనర్‌ గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తోంది. ఆ సమయంలో ఫార్చ్యూనర్‌ ముందు ప్రయాణం చేస్తున్న ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో ట్రక్కు వెనుక భాగానికి ఫార్చ్యూనర్‌ ఢీకొట్టింది. అయితే ఇంత భారీ ప్రమాదంలోనూ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని యాజమాని చెబుతున్నారు.

టయోటా ఫార్చ్యూనర్‌ బిల్డ్‌ క్వాలిటీ : అయితే టయోటా కార్ల బిల్డ్‌ క్వాలిటీ కారణంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ప్రయాణికులు అందరూ సీట్‌ బెల్ట్‌లు ధరించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ప్రయాణికుల్లో ఒకరు మాత్రం హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది.

Fortuner hits truck on suryapet highway

ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌లు ధరించినా : ఇలాంటి ప్రమాదాల్లో వాహనాల్లోని సీట్‌ బెల్ట్‌లు ధరించినా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనేందుకు అనేక సెన్సార్లు ఉంటాయి. నిర్ధిష్ట ప్రాంతంలో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనేందుకు అవకాశం ఉండదు.

పనిచేయని యాక్సెలిరో మీటర్‌ : ఎయిర్‌బ్యాగ్‌లు వాహనంలోని యాక్సెలిరో మీటర్‌పై ఆధారపడతాయి. ఈ యాక్సెలిరో మీటర్‌లో తగినంత ప్రమాద సంకేతం రాకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు. తక్కువ వేగంతో ప్రమాదం జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవు.

Fortuner hits truck on suryapet high way

సెకండరీ ఇంపాక్ట్‌ : ప్రమాద సమయంలో వాహనాలు మొదటి సారి ఢీకొట్టాక నియంత్రణ కోల్పోయి మరోసారి ఢీకొట్టిన సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు. దీంతోపాటు తొలిసారి ఢీకొట్టిన సమయంలో ప్రమాద తీవ్రత సరిపడినంతగా లేకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు.

ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకొనే అవసరం లేనప్పుడు : ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవు. అలాంటి సమయంలో సీట్‌బెల్డ్‌లు తగినంత రక్షణ అందిస్తాయి. అయితే తాజాగా జరిగిన ప్రమాద తీవ్రత భారీగానే కనిపిస్తోంది. అయినా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని యజమాని ఫిర్యాదు చేశారు.

Fortuner hits truck on suryapet highway at 140 kmph speed

సీట్‌బెల్ట్‌ : సీట్‌ బెల్ట్‌లు ధరించకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు. సీట్‌బెల్ట్‌లు ధరించకుండా ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకుంటే ప్రయాణికులకు గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌బ్యాగ్‌లు నిర్దిష్ట వేగంతో తెరుచుకొనే సమయంలో సరైన కోణంలో ప్రయాణికులు కూర్చోకుంటే వారు గాయపడే అవకాశం ఉంది.

అదనపు పరికరాలు : బుల్‌బార్‌ల వంటి ఉపకరణాలతో ఎయిర్‌బ్యా్గ్‌ల సెన్సాల పరితీరుపై ప్రభావం చూపుతుంది. ప్రమాద తీవ్రతను సెన్సార్లు గుర్తించకుండా ఈ బుల్‌బార్‌లు అడ్డుకుంటాయి. అదే విధంగా సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న వాహనాల్లో సీట్‌ కవర్లు కూడా ఇటువంటి చెడు ప్రభావాన్ని చూపుతాయి.

Toyota Fortuner hits truck at 140 kmph speed

ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేయకపోవడం : ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల వలే ఎయిర్‌బ్యాగ్‌లు కూడా పనిచేయకపోవచ్చు. అత్యాధునిక వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు విఫలం అయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.

హైడ్రో ప్లానింగ్‌ లేదా ఆక్వా ప్లానింగ్‌ : హైడ్రో ప్లానింగ్‌ లేదా ఆక్వా ప్లానింగ్ కారణంగా వాహనం ట్రాక్షన్‌ కోల్పోయే పరిస్థితుల్లో యాక్సిలెరోమీటర్‌ సరైన పనితీరు కనబరచదు. మరియు ట్రాక్షన్‌ కోల్పోవడం కారణంగా వాహనం సెన్సార్లు పనిచేయవు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 21, 2023, 14:38 [IST]
English summary
Toyota fortuner hits truck on suryapet highway at 140 kmph speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+