అక్కడ కార్ డ్రైవ్ చేసినందుకు రూ. 50,000 జరిమానా.. ఎక్కడనుకుంటున్నారా..!!
భారతదేశంలో అత్యద్భుతమైన మరియు అతి సుందరమైన ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇలాంటి పర్యాటక ప్రదేశాలను చూడటానికి ప్రపంచంలోని నాలు మూలాల నుండి కూడా పర్యాటకులు వస్తూనే ఉంటారు. అయితే ప్రతి పర్యాటక ప్రదేశంలోనూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా అందరూ పాటించాలి. అప్పుడే అక్కడ ఎటువంటి నష్టాలు జరగకుండా ఉంటాయి.
అయితే పర్యాటక ప్రదేశాల్లో కొంతమంది పర్యాటకులు అప్పుడుడప్పుడు నియమాలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. అలాంటి వారికి భారీ జరిమానాలు విధిస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటన ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం ఇటీవల ఒక జంట లడఖ్‌లోని నుబ్రా వ్యాలీలోని హుండర్ ఇసుక ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ లేహ్ పోలీసులకు పట్టుబడ్డారు. అక్కడ డ్రైవింగ్ వంటివి చేయడం పూర్తగా నిషిద్ధం. ఈ కారణంగా వారికి ఏకంగా రూ. 50,000 చలానా విధించారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్ లో మీరు గమనించినట్లతే.. ఇందులో టొయోట ఫార్చ్యూనర్ కనిపిస్తుంది. దీనికి ఢిల్లీ నంబర్ ప్లేట్ ఉంది. ఈ కారుని డ్రైవ్ చేసిన వారు రాజస్థాన్‌కు చెందినవారుగా గుర్తించారు. వారు ఢిల్లీ ఉంచి లేహ్‌కు ఆ టొయోట ఫార్చ్యూనర్ లోనే వచ్చినట్లు తెలుస్తుంది. లేహ్-లడఖ్‌లోని చాలా ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ విషయం దాదాపు చాలామందికి తెలుసు.

లడఖ్‌లో ఎక్కువ సంఖ్యలో ఇసుక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు స్థానిక యంత్రాంగం పర్యాటకులను నిషేధించింది. అయితే టొయోట ఫార్చ్యూనర్ లో వచ్చిన పర్యాటకులు దీనిని ఉల్లంఘించారు. ఈ కారణంగానే భారీ మొత్తంలో జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలా మంది వినియోగదారులు దానిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలా మంది దీనికి మద్దతు ఇస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం నిషేధించబడిన ప్రదేశాలను సందర్శించడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. అంతే కాకుండా మరికొందరు లడఖ్ వెళ్లే పర్యాటకులకు అక్కడ అమలులో ఉండే నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి అని కూడా తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలోనే లేహ్‌లోని పాంగోంగ్ సరస్సు ఒడ్డున ముగ్గురు వ్యక్తులు ఆడి కారును నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వారు ఆ సరస్సు దగ్గర ఒక టేబుల్ మరియు వైన్ బాటిళ్లను కూడా ఉంచాడు. ఇలా కారు నడపడం వల్ల అక్కడి పక్షులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజలు తెలిపారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, కొంతమంది లేహ్ పోలీసుల నుండి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాధారణంగా పర్యాటకులు ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించకూడదు. పర్యాటకులు వారు పర్యటించే ప్రదేశాల్లోని నియమాలను తప్పకుండా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా తెలుసుకోకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే వారికి ఇలాంటి జరిమానాలు విధించబడతాయి.

కేవలం పర్యాటక ప్రదేశాల్లో మాత్రమే కాకుండా రహదారులపైనా కూడా చాలామంది వాహనవినియోగదారులు ట్రాఫిక్ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ కారణంగా దేశంలో రోడ్డు ప్రమాదలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంగిస్తే వారికి భారీగా జరిమానాలు విధించడమే కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా రద్దు చేయబడుతుంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 4.50 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అయితే ఇందులో దాదాపు 1.50 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ కారణంగానే ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. దీనిని తగ్గించడానికి రవాణా మంత్రిత్వ శాఖ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

రవాణా మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం 2020 సంవత్సరంలో మొత్తం 1,20,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువభాగం 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉండటం గమనార్హం. ఏ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు మాత్రమే కాదు వాహన వినియోగదారులు కూడా సహకరించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గుతుంది.
గమనిక: ఇందులో ఉపయోగించిన మొదటి రెండు ఫోటోలు తప్పా మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే, పాఠకులు గమనించగలరు.


Click it and Unblock the Notifications








