Toyota Fortuner త్వరగా చేరుకోవాలని ఆశ.. డివైడర్‌పై ఇరుక్కుపోయిన టయోటా ఫార్చ్యూనర్.. వీడియో వైరల్..!
టయోటా ఫార్చ్యూనర్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని సెగ్మెంట్లోని SUVలల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కారుగా దీనికి గుర్తింపు ఉంది. ఆఫ్ రోడ్డుపై ఈ SUV ప్రసిద్ది చెందింది. ఆఫ్-రోడ్‌పై ఈ ఫార్చ్యూనర్ ఆకట్టుకునే ప్రదర్శనలు చేసిన వీడీయోలను చూడవచ్చు. ఎలాంటి భూభాగాలనైనా ఇది సులభంగా ఎదుర్కోగలదు.
నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం తప్పనిసరి. కాదని షార్ట్ కట్ లు తీసుకోవడం వల్ల తరచుగా ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ కారు చిక్కును ఎదుర్కొంది. మనం చర్చించబోయే కథనంలో ఓ టయోటా ఫార్చ్యూనర్ యజమాని ఇరుక్కుపోయిన విషయాన్ని గమనించవచ్చు.

Veeru__555_rj.04 అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ లో టయోటా ఫార్చ్యూనర్ నడిరోడ్డుపై ఉన్న డివైడర్ మీద ఇరుక్కు పోయిన వీడియోను షేర్ చేశాడు. కారుని ముందుకి వెనక్కి తీసే క్రమంలో ఇదీ అందులో చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతంలో ఈ వీడియో రికార్డయింది. అయితే సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయంపై స్పష్టత లేదు.
ఫార్చ్యూనర్ డ్రైవర్ ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడానికి లేదా ఇంటికి త్వరగా చేరుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. SUVతో ముందు చక్రాలు మీడియన్ పైకి ఎక్కినప్పటికీ, స్ట్రిప్ తగినంత వెడల్పు లేకపోవడంతో ఎస్ యూవీ ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఏమి చేయాలో తెలియని స్థితిలో డ్రైవర్(యజమాని) ఉండిపోయాడు.
ఎస్ యూవీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు లేదా రివర్స్ లో కదిలించలేని ప్రమాదకర పరిస్థితిలో నిలిపివేశాడు. ఫార్చ్యూనర్ ఫుట్ బోర్డ్ పూర్తిగా డివైడర్ పై ఉంది. డ్రైవర్ కారును రివర్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, రహదారిపై ఇతర వాహనాలు ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. దీంతో చేసేదేమిలేక అలానే నిలబడి పోయాడు. ఇతర డ్రైవర్లను నిలువరిస్తూ వాహనాన్ని రివర్స్ చేసే వరకు వేచి ఉండాలని అభ్యర్థిస్తాడు.
ఈ ప్రత్యేక ఎస్యూవీ 4×4 వేరియంట్ అత్యధిక ఆఫ్-రోడ్ సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వెనుక చక్రాల నుంచి కావాల్సిన పట్టు/వేగం లేకపోవడం వల్ల అవతలి వైపుకు దాటలేకపోయింది. ఎస్ యూవీ దృఢంగా ఉందని, దానిని వదిలించుకోవడానికి డ్రైవర్ కు ఉన్న ఏకైక మార్గం వాహనాన్ని పైకి లేపడానికి జాక్ ను ఉపయోగించే ఆప్షన్ మాత్రమే ఉండటం గమనార్హం. లిఫ్ట్ చేసిన తర్వాత, ముందు చక్రాల కింద ఒక రాయిని ఉంచి కారును బయటకు తీశారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ రోడ్డు నియమాలను పాటించడం మరియు రోడ్డుపై ఇతరులకు అసౌకర్యం కలిగించే ఇలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. ఇటువంటి విన్యాసాలకు ప్రయత్నించేటప్పుడు వాహనంలోని కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీలు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను అందిస్తాయి. అయితే ఇతరుల కంటే ముందు ఉండటానికి డివైడర్ల మీద నుంచి డ్రైవింగ్ చేసే విధానం మంచి పద్ధతి కాదని తెలుసుకోవాలి.
అలానే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సృష్టించకుండా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ సమయాన్ని ఆదా చేయడానికి షార్ట్ కట్ తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది కాబట్టి చేరుకోవాల్సిన సమయం కంటే ముందే బయలుదేరడం ఉత్తమం. ఇలాంటి సంఘటనల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దీంతోపాటు ఇతరుల సమయం వృధా అయ్యే అవకాశం ఎక్కువ.


Click it and Unblock the Notifications








