ఇది చూసారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో టయోటా బ్రాండ్ యొక్క ఫార్చ్యూనర్ ఒకటి. టయోటా ఫార్చ్యూనర్ చాలామంది కస్టమర్లు నచ్చిన మరియు ఎంతగానో ఇష్టపడే ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ చాలా సంవత్సరాలుగా ఫుల్ సైజు ఎస్‌యూవీ విభాగంలోని అమ్మకాల పరంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

టయోటా ఫార్చ్యూనర్ దూకుడుగా మరియు పవర్ ఫుల్ ఆఫ్-రోడర్‌గా ప్రసిద్దిపొందింది. ఫార్చ్యూనర్ కేవలం మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది, కావున ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా మంది ఈ ఫార్చ్యూనర్ వినియోగదారులు దీనిని కస్టమైజ్ చేయడానికి ఎంచుకుంటారు.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఇక్కడ ఈ ఆర్టికల్ లో మీరు కస్టమైజ్డ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క ఫోటోలను చూడవచ్చు. ఇక్కడ ఉన్న కస్టమైజ్డ్ టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ అంతర్నిర్మిత టాయిలెట్‌ కలిగి ఉంది. భారతదేశంలో అంతర్నిర్మిత టాయిలెట్ ఉన్న మొదటి టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇదే కావచ్చు.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఈ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క వీడియోను రెవోకిడ్ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో బయటి టయోటా ఫార్చ్యూనర్‌ని చూపించడంతో ప్రారంభమవుతుంది. ఇది 2021 మోడల్ టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఈ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క బూట్ లోపల ఉన్న స్థలం టాయిలెట్ సెటప్‌కు సరిపోయేలా ఉపయోగించబడుతుంది. టాయిలెట్ సెటప్ ఉన్న టయోటా ఫార్చ్యూనర్ బహుశా ఇదే అని భావిస్తున్నాము. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్ లేనట్లయితే లేదా పబ్లిక్ టాయిలెట్‌ని ఉపయోగించడం వస్తుందనే నేపథ్యంలో ఈ రకమైన కార్ ఉపయోగపడుతుంది.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఈ వీడియోలో కనిపించే టయోటా ఫార్చ్యూనర్ బయటి నుండి స్టాక్ లాగా కనిపిస్తుంది. ఇది 18 ఇంచెస్ టైర్లతో భర్తీ చేయబడింది. ఈ కారు లోపల టాయిలెట్‌కు సరిపోయేలా మూడో వరుస సీటు తొలగించబడింది. రెండవ వరుస సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా ఇక్కడున్న టాయిలెట్ ఉపయోగించుకోవచ్చు.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఇక్కడ టాయిలెట్ కి కావాల్సిన వాటర్ ట్యాంక్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కారులో ఏర్పాటు చేయబడిన టాయిలెట్ కి ఎంత ఖర్చు అయ్యిందనే సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో చాలా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పవచ్చు.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఈ టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా, 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో నవీకరించబడిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇది క్రోమ్ సరౌండ్‌తో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్‌ల కోసం కొత్త హౌసింగ్‌తో ఫ్రంట్ బంపర్‌ను అప్‌డేట్ చేసింది. కొత్త 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వెనుక భాగంలో అమర్చబడి ఉన్నాయి.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్లను కలిగి ఉండటం వల్ల, ఇది మరింత ప్రీమియం ఇంటీరియర్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది. అంతే కాకుండా ఇది కొత్త 8.0 ఇంచెస్ అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ టెక్నాలజీని కలిగి ఉంది.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

ఈ ఎస్‌యూవీ 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో ఉన్న 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 బిహెచ్‌పి మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్న డీజిల్ ఇంజిన్ 177 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది మరియు టూ-వీల్ మరియు ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. మునుపటి ఫార్చ్యూనర్ మోడల్‌తో పోలిస్తే 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ అనేక అప్‌డేట్‌లను పొందింది. ఇక్కడ మీరు చూస్తున్న టయోటా ఫార్చ్యూనర్ లాంగ్ డ్రైవ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇది విన్నారా.. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో టాయిలెట్ [వీడియో]

భారతదేశంలో వాహనాలను కస్టమైజ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇది వరకే మనం చాలా కస్టమైజ్ వాహనాలు గురించి తెలుసుకున్నాం. అయితే కొన్ని మోటార్ వాహన చట్టానికి విరుద్ధంగా ఉంటాయి. మరి కొన్ని చట్ట నిబంధనలను పాటిస్తూ ఉంటాయి.

Image Courtesy: Revokid Vlogs

Most Read Articles

English summary
Toyota fortuner suv gets toilet setup in boot here is video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X