ఇలాంటి 'హైలక్స్ పికప్ ట్రక్' ఎప్పుడూ చూసుండరు!.. వీడియో చూసెయ్యండి
ఆధునిక కాలంలో భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ / కస్టమైజ్ సర్వ సాధారణం అయిపోయింది. గతంలో కూడా మనం చాలా కస్టమైజ్ వాహనాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కస్టమైజ్ 'టయోటా హైలక్స్' (Toyota Hilux) గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో టయోటా హైలక్స్.. ఫార్చ్యూనర్ మాదిరిగా గొప్ప ప్రజాదరణ పొందలేదు. అయితే కొంతమంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అలంటి వారిలో ఒకరు హైలక్స్ పికప్ ట్రక్కును మరింత అందంగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భారీగా మోడిఫైడ్ చేయబడిన టయోటా హైలక్స్ పికప్ ట్రక్ దర్శనమిస్తుంది. బహుశా ఇలాంటి కారును ఇప్పటి వరకు మీరు చూసి ఉండరని భావిస్తున్నాము.

ఈ స్పెషల్ టయోటా హైలక్స్ పికప్ ట్రక్.. మెటల్ బంపర్, రోల్ బార్, ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో చాలా కొత్తగా రూపొందించబడి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఆజాద్ 4X4 ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో ప్రెజెంటర్ హైలక్స్ పికప్ ట్రక్కులో చేసిన మార్పులను.. దానికి యాడ్ చేసిన యాక్ససరీస్ గురించి వివరిస్తారు. ఇందులో కొత్త బోనెట్.. పాత గ్రిల్ స్థానంలో రెడ్ కలర్ బ్రాండ్ లోగో ఉన్నాయి.
ముందు భాగంలో హామర్ మెటల్ బంపర్ ఉంది. దీనిని థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఆఫ్-రోడ్ యాక్ససరీస్ తయారీదారు నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. బంపర్ స్లాట్, అదనపు లైట్స్ కోడం మౌంట్ పాయింట్స్ మరియు లైట్ బార్ వంటివి ఇందులో గమనించవచ్చు. ప్రెజెంటర్ మెకానికల్ అప్‌గ్రేడ్‌లను వివరిస్తూ.. ప్రొఫెండర్ నుంచి 2 ఇంచెస్ లిఫ్ట్ కిట్ చూపిస్తాడు. ఇది అడ్జస్టబుల్ కిట్.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఫ్రంట్ బంపర్ మాదిరిగానే ఫెండర్లకు షార్క్ స్కిన్ కోటింగ్ లభిస్తుందని పేర్కొన్నాడు. ఫ్యూయెల్ పిల్లర్ క్యాప్ మాత్రమే కాకుండా డోర్ హ్యాండిల్స్, హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్‌లను కవర్ చేసే అదనపు బ్లాక్ ఎలిమెంట్లను కూడా ఇక్కడా గమనించవచ్చు. ఈ వెహికల్ ప్రస్తుతం స్టాక్ వీల్స్‌లో ఉందని, ఇది త్వరలో మార్చబడుతుందని ప్రెజెంటర్ పేర్కొన్నాడు.
ఇక చివరగా రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా చాలా మార్పులు చేసి ఉండటం చూడవచ్చు. ఇక్కడ లూనార్ లగేజ్ క్యారియర్‌తో పాటు ఒరిజినల్ హామర్ రోల్ కేజ్‌ని చూపిస్తాడు. ట్రక్ బెడ్ వ్వ్న్ చేయడానికి ఆటోమాటిక్ కీ ఉపయోగిస్తాడు. దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఒక్క బటన్ క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది.
టయోటా హైలక్స్ యొక్క మొత్తం మోడిఫికేషన్స్ గురించి ప్రజెంటర్ వివరంగా వివరిస్తాడు. అయితే లోపల ఏమైనా మార్పులు చేశారా.. లేదా అనే విషయాలను మాత్రం అతడు వెల్లడించలేదు. అంతే కాకుండా ఈ కారు యొక్క ఇంజిన్లో ఏమైనా మార్పులు చేశారాఅనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ హైలక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఇంతగా కస్టమైజ్ చేయబడిన హైలక్స్ బహుశా ఇదే కావొచ్చని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








