బుల్ డోజర్‌లా బస్సును లాగిన టయోటా హిలక్స్.. సెకన్లలోనే అలవోకగా.!!
భారతీయ మార్కెట్‌లో టయోటా బ్రాండ్ ప్రసిద్ధ మోడళ్లకు గుర్తింపు పొందింది. ప్రస్తుతం, టయోటా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా, ఫార్చ్యూనర్, గ్లాంజా మరియు ల్యాండ్ క్రూయిజర్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. అంతే కాకుండా వాణిజ్య అవసరాల కోసం అత్యంత శక్రివంతమైన పికప్ ట్రక్ టయోటా హిలక్స్‌ను గతేడాది మార్కెట్‌లోకి విడుదల చేసింది.
చాలా మంది ఆఫ్-రోడ్ ఔత్సాహికులు కోరుకునే SUV టయోటా హిలక్స్(Toyota Hilux). ఈ వాహనానికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఇటీవల టయోటా హిలక్స్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయవడంతో ఔత్సాహికుల నుంచి విపరీతంగా స్పందన లభించింది. దీంతో మళ్లీ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఆ స్థాయి డిమాండ్‌ను సొంతం చేసుకున్న టయోటా హిలక్స్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

సాధారణంగా రోడ్డుపై వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు బస్సు, కార్లు, లేదా బైకులు లోయలో పడిపోయినా లేదా గుంతల్లో చిక్కుకుపోయినా బుల్‌డోజర్ల సాయంతో సురక్షితంగా బయటకు తీస్తారు. కానీ ఇక్కడ టయోటా హిలక్స్ సాయంతో రోడ్డు పక్కన గుంతలో చిక్కుకుపోయిన బస్సును సురక్షితంగా రోడ్డుపైకి చేర్చింది. పూర్తి వివరాలను ఈ కథనంలో చదవండి.
దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో, టయోటా హిలక్స్ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయిన బస్సును సులభంగా బయటకు తీయడాన్ని చూడవచ్చు. చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు తిరుగు ప్రయాణంలో రోడ్డుపై మీదు అదుపు తప్పి చిన్న గుంతలో కూరుకుపోయిన బస్సును బయటకు తీయడానికి సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేదు.

రోడ్డు పక్కనే బురదలో బస్సు ఆగిపోవడంతో వెనుక చక్రాలు కాలువలోకి జారి పడే ప్రమాదం ఉంది. వెనుక చక్రాలు బురదలో కూరుకుపోవడంతో బస్సును రోడ్డుపైకి చేర్చడం కష్టంగా మారింది. అదే సమయంలో రహదారిపై టయోటా హిలక్స్(Toyota Hilux) లోడ్‌ను తీసుకువెళుతోంది. హిలక్స్ కింద పట్టీని బస్సు ముందు భాగానికి జత చేశాక, బస్సును లాగడం ప్రారంభించింది. కొంచెం వీల్ స్పిన్ ఉన్నప్పటికీ.. ట్రక్కు బస్సును సెకన్లలో రోడ్డుపైకి చేర్చింది.
టయోటా హిలక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిక్-అప్ ట్రక్ కావడంతో, ఇది కఠినమైన భూభాగాలను కూడా నిర్వహించేలా తయారు చేయబడింది. ఇది ఎంతటి సామర్థ్యం గల ఆఫ్-రోడర్‌గా ఉందంటే, ఇండియన్ ఆర్మీ ఇటీవలే టయోటా హిలక్స్ 4×4 లగ్జరీ పికప్ ట్రక్కును తన వాహన శ్రేణిలో చేర్చింది.
టయోటా హిలక్స్ ఒకే 2.8-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజిన్ ఎంపిక టయోటా ఫార్చ్యూనర్‌కు శక్తినిచ్చే ఇంజిన్‌తో సమానంగా ఉంటుంది. ఇది మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో గరిష్ఠంగా 204 PS వద్ద 420 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పికప్ ట్రక్ యొక్క అన్ని వేరియంట్లు ప్రామాణికంగా 4×4 సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి.
టయోటా హిలక్స్ ప్రస్తుత ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 30.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 700 మిల్లీమీటర్ల వాటర్ వాడింగ్ కెపాసిటీ(water wading capacity)ని కలిగి ఉంది. అదేవిధంగా టొయోటా ఎల్‌ఎస్‌డి, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రియర్ డిఫ్ఫ్ లాక్‌ను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








