15 లక్షల కారును రెండు కోట్ల ఖరీదైన కారుగా మార్చేసిన ఘనుడు

ఓ కస్టమర్ తన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని లక్షల వెచ్చించి కోట్ల రుపాయలు ఖరీదు చేసే లెక్సస్ లగ్జరీ ఎస్‌యూవీ ఎల్ఎక్స్ రూపంలోకి మార్పించుకున్నాడు.

By Anil Kumar

మోడిఫికేషన్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్న పదం. ఇతరుల కార్ల కంటే తమ కారు ఎంతో విభిన్నంగా ఉండాలని భావించే కొంత మంది ఓనర్లు తమ కార్లకు మోడిఫికేషన్స్ చేయించుకుంటారు. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా... ఎంత సమయం వెచ్చించడానికైనా వెనకాడటం లేదు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

తాజాగా, ఓ కస్టమర్ తన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని లక్షల వెచ్చించి కోట్ల రుపాయలు ఖరీదు చేసే లెక్సస్ లగ్జరీ ఎస్‌యూవీ ఎల్ఎక్స్ రూపంలోకి మార్పించుకున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ....

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

మీరే కాదు, దీనిని చూసిన మొదట్లో కూడా మేము కూడా ఇది లెక్సస్ ఎల్ఎక్స్ ఎస్‌యూవీ అనుకున్నాం. అయితే, ముందు మరియు వెనుక వైపున్న టయోటా లోగో మరియు కొలతలను గమనిస్తే ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీని తెలుసుకోగలిగాము.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

థాయిలాండ్‌కు చెందిన థాయ్ భట్ అనే మోడిఫికేషన్ కంపెనీ ఓ సెకండ్ హ్యాండ్ టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాన్నికి తమదైన శైలిలో మోడిఫికేషన్స్ నిర్వహించి ఆ యా కంపెనీలనే బురిడీ కొట్టించేలా మార్చేశారు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

మోడిఫికేషన్స్ ఖర్చులతో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా మోడిఫైడ్ లెక్సస్ ఎల్ఎక్స్ ఎస్‌యూవీ ధర రూ. 28.7 లక్షలుగా పేర్కొంది. వెహికల్ కాకుండా, కేవలం మోడిఫికేషన్ ఖర్చు 15 లక్షలు అని వివరించింది.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

మోడిఫికేషన్స్ విషయానికి వస్తే, రెగ్యులర్ ఇన్నోవా క్రిస్టాలోని ఫ్రంట్ డిజైన్‌లో లెక్సస్ ఎల్ఎక్స్ తరహా స్పిండిల్ గ్రిల్ ఇరువైపులా మెటల్ సరౌండింగ్ ఫ్రేమ్ జోడించారు. మెటల్ ఫ్రేమ్‌లో తిరగేసిన ఎల్-ఆకారంలో ఉన్న బ్లాక్ సరౌడింగ్స్‌లో ఫాగ్ ల్యాంప్స్ అమర్చారు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

రెండు విడిపోయి ఉన్న బంపర్, ఫ్రంట్ గ్రిల్ మరియు ఎయిర్ ఇంటేకర్ అన్నీ లెక్సస్ ఎస్‌యూవీనే తలపించాయి. అయితే, ఎన్ని మార్పులు చేర్పులు చేసినా నేను టయోటా ఇన్నోవా క్రిస్టా కారునే అని తెలిపేలా టయోటా లోగోను మాత్రం ముందు మరియు వెనుక వైపున యథావిధిగా అందించారు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

ఫ్రంట్ డిజైన్ పరంగానే కాకుండా, సైడ్ ప్రొఫైల్ కూడా లెక్సస్ స్టైల్లో తీర్చిదిద్దారు. లో ప్రొఫైల్ కలిగిన టైర్లు, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ టోన్ బంపర్లు మరియు ఫాక్స్ డిఫ్యూజర్ వంటివి జోడించారు. వీటితో పాటు గ్లాస్ బ్లాక్ రూఫ్ ఫినిషింగ్, క్రోమ్ ఫినిషింగ్ గల డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి గుర్తించవచ్చు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

థాయి భట్ కస్టమైజేషన్ బృందం 16 రోజుల నిరంతరం శ్రమించి ఈ 15 లక్షలు విలువ చేసే ఇన్నోవా క్రిస్టాకు మరో 15 లక్షలు ఖర్చు పెట్టి సుమారుగా 2.3 కోట్ల ఖరీదైన లగ్జరీ లెక్సస్ ఎల్ఎక్స్ రూపంలోకి మార్చేసింది.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌‌పీవీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 14.33 లక్షలు. లెక్సస్ రూపంలో మార్పించేందుకు, దీని అసలు ధర కంటే ఎక్కువ వెచ్చించాడు. ఏదేమైనప్పటికీ, ఇప్పుడు రెండున్నర కోట్ల రుపాయలు ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నట్లు హుందాతనాన్ని అనుభవిస్తున్నాడు.

మోడిఫైడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ భారీ విజయాన్ని అందుకుంది. టయోటా ఇండియాకు అత్యధిక విక్రయాలు సాధించిపెడుతున్న మోడల్ కూడా ఇదే. సాంకేతికంగా ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది.

Source: Zing.VN

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Innova Crysta owner spends Rs 15 lakhs on modification – Here is the result
Story first published: Thursday, June 28, 2018, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X