వామ్మో..! ఈ ఇన్నోవా కారు పవర్ మామూలుగా లేదు.. హైవేపై మూడు కార్లను ఒకేసారి లాగేసింది!
జర్నీ మధ్యలో కారు చెడిపోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? రోడ్డు పక్కన కారును ఆపి, ఎవరినైనా సహాయం కోసం పిలుచుకొస్తాము. దాన్ని సరిచేపిస్తాం. మరి ఆ కారు గ్యారేజీకి తీసుకువెళ్తేనే పరిష్కారం అవుతుందంటే..? ఇక ఆ చెడిపోయిన కారునే అక్కడకు తీసుకువెళ్లక తప్పదు. అలాంటప్పుడు.. మరొక కారుతో కట్టి దాన్ని లాగి తీసుకువెళ్తుంటాం. ఇది ఇండియాలో అంతటా జరిగేదే! హైవేలపై ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి. అయితే.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక కారుకు ఇంత బలం ఉంటుందా అని అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 'ఇది పెద్ద సాహసమే' అని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అసలింతకీ అందులో ఏముందంటే..?
ఓ టయోటా ఇన్నోవా కారు... ఒకటి కాదు, రెండు కాదు, మూడు కార్లను లాగుతూ ఈ వీడియోలో కనిపించింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి షేర్ చేశాడు. అతడు అదే హైవేలో మరో కారులో వెళ్తుండగా దీన్ని చిత్రీకరించాడు. అయితే...ఇది కచ్చితంగా ఎక్కడ జరిగిందన్న సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది.

కానీ, దక్షిణ భారతదేశంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో టయోటా ఇన్నోవా కారు... రోడ్డుకు ఎడమవైపున వెళ్తూ మూడు కార్లను లాగుతూ తీసుకువెళ్తోంది. ముందు టయోటా ఇన్నోవా ఉంటే.. దాని తర్వాత హ్యూందాయ్ ఐ20 ఉంది. దాని తర్వాత మారుతీ WagonR కారు, ఆ తర్వాత మారుతీ సుజుకీ Zen Estilo హ్యాచ్‌బ్యాక్ ఉంది.
బిజీ హైవేలో ఈ మూడు హ్యాచ్‌బ్యాక్స్‌లను టయోటా ఇన్నోవా ఎంపీవీ లాగుతూ వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ కార్లన్నింటినీ చెయిన్‌తో లాగి కట్టారు. వీటి నంబర్ ప్లేట్లను పరిశీలిస్తే.. అవి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్లలా తెలుస్తోంది.

ఈ వివరాలను పక్కన పెడితే.. టయోటా ఇన్నోవాను దాన్ని నడుపుతున్న డ్రైవర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇన్నోవా ఎంపీవీ పవర్, రిలయబిలిటీని కూడా మెచ్చుకుంటున్నారు. "ఒక కారును లాగుతున్న మరో కారు, మరో కారును లాగుతున్న మరోకారు, మరో కారును లాగుతున్న మరోకారు" అంటూ ఒకరు కామెంట్ చేశారు. "అసలు ఈ కార్లన్నింటిలో ADAS ఉందా" అని మరొకరు కామెంట్ చేశారు.
మూడు కార్లను ఇన్నోవాకు కట్టి ఉంచిన్నప్పటికీ.. ముందు వెళ్తున్న ఇన్నోవా కారు మాత్రం సునాయాసంగా వీటిని తరలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసేందుకు రోడ్డు మీద ట్రెయిన్ వెళ్తుందా అన్నట్లుగా కనిపించింది. అయితే... ఈ కార్లు చెడిపోతే వాటిని గ్యారేజ్‌కు తరలిస్తున్నారా? లేక స్క్రాపింగ్ కోసం వాటిని తీసుకువెళ్తున్నారా అనేది తెలియరాలేదు.
అయితే ఈ కార్లను హైవేపై ఇలా ఇంత వేగంతో తరలించడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ కార్లన్నీ చెయిన్‌తో కట్టి ఉన్నప్పటికీ అవి తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. దానివల్ల ఇతర వాహనదారులు ప్రమాదానికి గురవుతారు. కాబట్టి.. రోడ్డుపై ఇలాంటి సాహసాలు చేయకపోవడం మంచిది. అనివార్య పరిస్థితుల్లో ఇలా తరలించాల్సిన వచ్చినప్పుడు ఇతర వాహనాలను హెచ్చరిస్తూ ఒక కారుతో ఒకదాన్ని మాత్రమే తరలించాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








