టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్ యాచ్

By Ravi

జర్మన్ కార్ మేకర్ టొయోటా అద్భుతమైన కార్లనే కాకుండా, అద్భుతమైన బోట్లను కూడా తయారు చేయటం జరిగింది. ప్రస్తుతం కార్లను కూపె, సెడాన్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, హ్యాచ్‌బ్యాక్స్, కన్వర్టిబల్స్ అంటూ వివిధ వర్గాలుగా విభజించినట్లుగానే, బోటింగ్‌లో కూడా ఓ కొత్త విభాగాన్ని సృష్టిస్తూ టొయోటా తమ సరికొత్త 'స్పోర్ట్స్ యుటిలిటి క్రూజర్' (ఎస్‌యూసి)ను ప్రవేశపెట్టింది.

టొయోటా తయారు చేసిన ఈ స్పోర్ట్స్ యుటిలిటి క్రూజర్ పేరు పోనమ్-31 (Ponam-31). ఈ కొత్త విభాగంలో (ఎస్‌యూసిలో) ఉత్పత్తిని అందిస్తున్న ఏకైక సంస్థ టొయోటానే కావటం విశేషం. ఓ చిన్న కుటుంబం నీటిపై విహారానికి వెళ్లేందుకు వీలుగా తయారు చేసిన టొయోటా పోనమ్-31 క్రూజర్ బోట్‌లో అన్ని సదుపాయాలను సమకూర్చారు.

టొయోటా పోనమ్-31 క్రూజర్ బోట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

తర్వాతి స్లైడ్‌లలో టొయోటా పోనమ్-31 క్రూజర్ బోట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

టొయోటా పోనమ్-31 క్రూజర్ బోట్‌లో కంపెనీ అందిస్తున్న ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీలో ఉపయోగించే 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్లను రెండింటిని ఉపయోగించారు. బోట్ ఉపయోగం కోసం ఈ ఇంజన్లను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఇవి రెండూ కలిసి 512 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

పోనమ్-31 హల్ (బోట్ క్రింది భాగం)ను ధృడమైన అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది మంచి సామర్థ్యాన్ని, ధృడత్వాన్ని మరియు మన్నికను కలిగి ఉండి, విరిగి పోకుండా ఉంటుంది (సాధారణ బోట్లలో ఫైబర్-రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుంటారు).

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

పోనమ్-31 క్రూజర్‌ను పైభాగంలో (ఓపెన్ టాప్) కూర్చుని సవారీ చేయవచ్చు. పైభాగంలో బోటును నడిపే వారితో పాటుగా మరో నలుగురు కూర్చునే వెసలుబాటు ఉంటుంది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో క్యాబిన్ లోపల నుంచే ఈ బోటును నియంత్రించవచ్చు.

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

బోటు లోపల వంట గది, సోఫా, లివింగ్ స్పేస్, రెస్టింగ్ రూమ్ వంటి పలు విలాసవంతమైన సదుపాయాలు ఉంటాయి.

టొయోటా పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ లగ్జరీ క్రూజర్

టొయోటా ప్రతి ఏటా 15 పోనమ్-31 స్పోర్ట్స్ యుటిలిటీ క్రూజర్లను విక్రయించాలని భావిస్తోంది. దీని ధర 2.77 లక్షల డాలర్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2014, 17:15 [IST]
English summary
Japanese automobile giant Toyota Motor Corporation has launched a new boat, the "Ponam-31"(1), which will go on sale through a network of 49 companies in domestic market. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+