కారు గుద్దితే ట్రాక్టర్ రెండు ముక్కలవుతుందా.. అయిపోయిందిగా..!!

సాధారణంగా మనం రోజూ ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక మూల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇలాంటి యాక్సిడెంట్స్ లో పెద్ద వాహనాలు చిన్న వాహనాలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. ఉదాహరణకు ఒక కారు, బైకును ఢీ కొడితే, ఆ బైకు నుజ్జు నుజ్జు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక ట్రాక్టర్, కారుని ఢీ కొడితే.. కారు నుజ్జు నుజ్జు అవుతుంది.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

కానీ ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన ఒక సంఘటనలో కారు ఢీ కొడితే.. ట్రాక్టర్ ఏకంగా రెండు ముక్కలైపోయింది. ఇది వినటానికి కొంత వింతగా ఉన్నా.. ఇదే నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'తిరుపతి' సమీరంలో ఉన్న చంద్రగిరి నేషనల్ హైవే సమీపంలో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బెంజ్ కారు ఇసుక లోడ్ తో వస్తున్న కారుని డీ కొట్టగానే ఆ ట్రాక్టర్ రెండు ముక్కలైపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

బెంజ్ కారు తిరుపతి నుంచి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతినింది. ఇందులో ట్రాలీ కూడా రోడ్డుమీదే బోల్తా పడింది. ముందు ఉన్న భాగం మాత్రం రెండుగా విడిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ కి ఎక్కువ గాయాలైనట్లు మరియు డ్రైవర్ ను తిరుపతి రుయా హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

ఈ సంఘటనలో బెంజ్ కారు కూడా ముందు భాగంలో దెబ్బతినింది, కానీ కారులోనివారు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారు నెంబర్ KA04 MU3456, అదే సమయంలో ట్రాక్టర్ నెంబర్ AP39 TL 8463. అయితే దర్యాపుతో ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తూ.. యు టర్న్ తీసుకునే సమయంలో వేగంగా వస్తున్న కారు డీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

హైవే పైన ట్రాక్టర్ రెండు ముక్కలు కావడం వల్ల రాకపోకలకు కొంత అంతరాయం అంతరాయం ఏర్పడింది. అయితే పోలీసులు ట్రాక్టర్ భాగాలను రోడ్డు పక్కకు తొలగించడం వల్ల ట్రాఫిక్ తొలగింది. ఈ ప్రమాదంలో కారు చాలా వేగంతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియరాలేదు.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

సాధారణంగా అతి వేగం ప్రమాదకరం అని నిత్యజీవితంలో చదువుకున్నాం.. ఆ వేగం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వాహన వినియోగదారులు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంవల్ల ప్రమాదాలు జరగటం ఇదే మొదటిసారి కారు, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయి. అయితే ఇందులో బెంజ్ కారు ఢీ కొట్టడం వల్ల ట్రాక్టర్ రెండు ముక్కలవ్వడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం.

హైవేపై కారు గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్.. పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ని కారు డీ కొట్టడం వల్ల రెండు ముక్కలైపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు ఎంత వేగంతో వస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు, కానీ అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని మరో సారి రుజువైంది. కాబట్టి వాహన వినియోగదారులు అతి వేగం ప్రమాదం మాత్రమే కాదు ప్రాణాంతకం అని కూడా గుర్తుంచుకోవాలి.

Most Read Articles

English summary
Tractor breaks in two pieces after being hit by a benz car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X