ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మహీంద్రా థార్ వాహనం.. రెండు ముక్కలైన ట్రాక్టర్
గతంలో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో సాధారణ సహా జాతీయ రహదారులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయినా రోడ్లపై డ్రైవింగ్ సవాల్‌తో కూడుకున్నదే.. ఎందుకంటే చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
జాతీయ రహదారిపై తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను మహీంద్రా థార్ వాహనం ఢీకొట్టిన దృశ్యాలు చూడవచ్చు. ఈ ఘటనలో ట్రాక్టర్ ఏకంగా రెండు భాగాలుగా విడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వీడియోను ప్రతీక్ సింగ్ తన యూట్యూబ్‌లో షేర్ చేశారు.

ఈ ఘటన నిన్న సాయంత్రం గుజరాత్‌లోని ఉనా భావనగర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. తప్పుడు మార్గంలో ట్రాక్టర్ జాతీయ రహదారిపైకి చేరే సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్‌ను ట్రాక్టర్ డ్రైవర్ గమనించకుండా వచ్చేసినట్లు తెలిపారు.
ఒక్కసారిగా ట్రాక్టర్ రహదారిపైకి రావడంతో.. వేగాన్ని నియంత్రించే సమయం లేక మహీంద్రా థార్ వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. జాతీయ రహదారి కావడంతో మహీంద్రా థార్ వాహనం అధిక వేగంతో ఉందని తెలుస్తోంది. ఈ వేగంతో సడన్‌గా వచ్చిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం ధాటికి మహీంద్రా థార్ వాహనం కూడా భారీగా దెబ్బతింది. ఫ్రంట్ బంపర్, గ్రిల్, బానెట్, టైర్లు దెబ్బతిన్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మహీంద్రా థార్ డ్రైవర్ చిన్న చిన్న గాయాలతో సురక్షితంగానే బయటపడ్డాడు. ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. ట్రాక్టర్ ముందు ట్రైర్లు కూడా విడిపోయి దూరంగా వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ ప్రధాన కారణం. తప్పుడు మార్గంలో జాతీయ రహదారిపైకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అలాగే మహీంద్రా థార్ డ్రైవర్ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది. అత్యంత వేగంగా వాహనం నడపడం అన్ని వేళల కూడా ప్రమాదకరమని గుర్తించాలి.
రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా, సమీపంలో వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా.. రెండు వైపులా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా కొంత మంది వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. జాతీయ రహదారిపైకి వచ్చే సమయంలో ఎదుటి వాహనాలను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇటీవల ఓ స్కూటర్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదానికి కారణం అయ్యారు. ఈ వీడియో వైరల్ అయింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








