భూ వివాదంలో దారుణ ఘటన.. తమ్ముడిని 8 సార్లు ట్రాక్టర్‌తో తొక్కి చంపిన అన్న

భూ వివాదంలో ఓ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా అడ్డా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా అడ్డా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అమానవీయంగా ప్రవర్తించి ఓ వ్యక్తిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Tractor-Rolls-Over-Brother-8-Times

ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ వికృత చేష్టలను మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించి ఆ వ్యక్తిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ కుటుంబీకులు అతడిని కాపాడలేకపోయారు. మరికొందరు బాధితుడి ప్రాణాలను కాపాడే బదులుగా ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీశారు.

ఇరు కుటుంబాల గొడవలో గాయపడిన 12 మందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటన విషయం తెలిసిన వెంటనే బయానా పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tractor-Rolls-Over-Brother-8-Times

అడ్డా గ్రామానికి చెందిన అన్నదమ్ములు బహదూర్ సింగ్ గుర్జార్, అతర్ సింగ్ గుర్జర్ కుటుంబాల మధ్య భూమి విషయంలో గత కొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా మూడు రోజుల క్రితం వారిమధ్య గొడవ తీవ్రం కావడంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి దాదాపు 22 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రమంలో బుధవారం బహదూర్ సింగ్ గుర్జార్ కుటుంబం వివాదాస్పద భూమిలో ట్రాక్టర్లతో దున్నేందుకు వెళ్లారు. అప్పుడు, అతర్ సింగ్ గుర్జర్ కుటుంబం సంఘటనా స్థలానికి వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకుంది.

Tractor-Rolls-Over-Brother-8-Times

పొలం దున్నుతున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు అతర్‌ సింగ్‌ కుమారుడు నిర్పత్ సింగ్ గుర్జార్ ప్రయత్నించారు. ఆ సమయంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆపకుండా అమానవీయంగా 8 సార్లు ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతని కుటుంబీకులు ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయారు.

ఈ గొడవను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలి వచ్చారు. ఆ గొడవను ఆపకుండా.. ట్రాక్టర్‌తో ఓ మనిషిని నిర్దాక్షిణ్యంగా తొక్కుతున్నప్పటికీ ఏ మాత్రం స్పందించకుండా తమ ఫోన్లలో వీడియో తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై ఏఎస్పీ ఓంప్రకాష్ కల్వాణి స్పందించారు.

Tractor-Rolls-Over-Brother-8-Times

ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కొందరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రభుత్వ రంగంలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటనపై రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌పై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. వ్యక్తి మృతి చెందడానికి కారణమై అమానవీయంగా ప్రవర్తించిన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 25, 2023, 20:41 [IST]
English summary
Tractor driver drives over a man 8 times in rajasthan video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+