ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోతున్నాయి. ఈ విధమైన కారణాల వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. అయితే వాహన దారుల పరిస్థితి మరింత వర్ణనాతీతమయ్యింది. వర్షపు నీటిలో చిక్కుకుని వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

మన దేశంలో రోడ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత అద్వాన స్థితిలో ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఈ రోడ్లు చాలా దారుణంగా తహయారవుతాయి. వాహనదారులు పరిస్థితి భారీ వర్షంతో అగమ్యగోచరంగా మారుతుంది. కొన్నిసార్లు వాహనాన్ని రోడ్డుపై వదిలేసి ఇంటికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షపు నీటిలో చిక్కుకున్న వాహనాల గురించి మునుపటి కథనాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

నివేదికల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మీరు వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota Fortuner (టయోటా ఫార్చ్యూనర్) కారుని చూడవచ్చు. అంతే కాకుండా ఈ కారుని డ్రైవ్ చేసే పరిస్థితిలో కూడా లేదు. కావున కారు డ్రైవర్ కారు యొక్క పైకప్పుపై కూర్చున్నాడు.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

ఇక్కడ మీరు గమనించినట్లయితే అండర్‌పాస్ యొక్క ఈ వర్షపు నీటిలోకి కారు డ్రైవర్ ఎలా వచ్చాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. బహుశా ఆ కారు డ్రైవర్ ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చినవారు అయి వుండే అవకాశం ఉంటుంది. కావున ఈ విధమైన నీటిలో ఇరుక్కున్నాడు.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

సాధారణంగా ఒక వాహనదారుడు కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో రోడ్లు సజావుగా ఉన్నాయా, లేదా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున రోడ్ల గురించి ముందుగా తెలుసుకోవడం మంచిది.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే రోడ్డుకి రెండుపక్కలా పెద్ద గోడల ఉండటం వల్ల ఈ కారు అండర్‌పాస్‌లో ఇరుక్కున్నట్లు స్పష్టమవుతోంది. నీటి లోతును కచ్చితంగా అంచనా వేయకపోవడం వల్ల ఈ ఫార్చ్యూనర్ కారు డ్రైవర్ ఈ సొరంగ మార్గం వెంట డ్రైవింగ్ చేసాడు. అయితే వర్షపు నీరు ఎక్కువగా ఉందని కొంత సమయం తరువాత నిర్దారించుకున్న డ్రైవర్ కారుని ఆపి కారు పైకప్పుపై కూర్చున్నాడు.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

కారు డ్రైవర్ కారు యొక్క పైకప్పుపై కూర్చుని సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు.కొంత సమయానికి కొంతమంది వ్యక్తులు అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నీటిలో చిక్కుకున్న కారుని బయటకు తీయడానికి వారు ఒక ట్రాక్టర్ సహాయం తీసుకున్నారు. మొత్తానికి కారుని ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకురావడం ఇక్కడ గమనించవచ్చు.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

Toyota Fortuner ఒక పొడవైన కారు కావున, ఇలాంటి పరిస్థితిలో కారుని బయటకు తీసుకురావడం చాలా కష్టం, అయితే కొన్ని తక్కువ ఎత్తులో ఉండే హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్లు సులభంగా ఇలాంటి వర్షపు నీటి నుంచి బయటపడగలవు. Toyota Fortuner కారు డ్రైవర్ నీటి లోతును పట్టించుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బురదలో చిక్కుకున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగారు. అంతే అక్కవుందా కొద్దిరోజుల క్రితం ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారు అమాంతం గుంటలో పడిపోయింది. తరువాత క్రేన్ సహాయంతో బయటకు లాగారు.వర్షపు నీరు నిలువ వుండే ప్రాంతాల్లో వాహనదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించిన వారే అవుతారు. కావున వాహన వినియోగదారులు డ్రైవింగ్ చేసే రహదారులను కూడా గమనిస్తూ ఉండాలి.

ట్రాక్టర్ వల్ల బయటపడ్డ వర్షపు నీటిలో చిక్కుకున్న Toyota కారు: వీడియో

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. వర్షపు నీటిలో ఒక ఎంపీతో వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు ఇందులో చిక్కుకుంది. ఈ ఎంపీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు. యితడు క్షేత్ర పర్యటన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. కావున వాహనదారులు వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఎంతగానో అలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, లేకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

Most Read Articles

English summary
Tractor rescues toyota fortuner which was stuck in flooded underpass video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X