టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అన్నిరకాల వ్యవసాయ పంటలు చాలా పుష్కలంగా పండుతాయి. దేశంలో చాలా వరకు ప్రజలు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ పద్ధతులు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు పుట్టుకొస్తున్నాయి.

టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది

వ్యవసాయంలో ట్రాక్టర్లు ఎంత పెద్ద పాత్ర వహిస్తాయో అందరికి తెలుసు. కావున రైతులకు వ్యవసాయంలో ట్రాక్టర్లు చాలా అత్యవసరం. వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ట్రాక్టర్లు కూడా కొత్తగా రూపొందుతున్నాయి. అయితే ఇటీవల టైర్లు లేని ఒక ట్రాక్టర్ ఆంధ్రపదేశ్ లోని ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షమైంది.

నివేదికల ప్రకారం, ఖమ్మం రూరల్ లోని మద్దులపల్లిలో టైర్లు లేని ట్రాక్టర్ ఒకటి కనిపించింది. ఒక రైతు ఖ‌మ్మం వైపు నుంచి హైద‌రాబాద్ వేళ్లే ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం సాయంత్రంఈ ట్రాక్టర్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దీనికి టైర్లు లేదు, ఆ స్థానంలో ఎడ్బందికి ఉన్న చక్రాల మాదిరిగా ఉండే చక్రాలు ఉన్నాయి.

ఎడ్లబండిలాంటి చక్రాలున్న ఈ ట్రాక్టర్ ని అక్కడ ప్రజలు చాలా ఆశ్చర్యంగా చూడటానికి ఎగబడ్డారు. అంతే కాలేదు ఇలాంటి ట్రాక్టర్ మునుపెన్నడూ కూడా చూడలేదని చెప్పారు.

ఈ కొత్తరకం ట్రాక్టర్ తయారు చేసుకున్న రైతు దీని గురించి చెబుతూ, ఇది మిరప, ప‌త్తి, మొక్కజొన్న వంటి చేలల్లో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని, దీని వల్ల మొక్కలు విరిగిపోకుండా ఉంటాయని చెప్పారు. సాధారణంగా ఎద్దుల మడక(అరక) ఉపయోగిస్తే మొక్కలు విరిగిపోయి అవకాశం ఉందని, అంతే కాకుండా దీనికి మనుషులు కూడా ఎక్కువ కావలసి వస్తుందని తెలిపాడు.

ఈ ఎడ్లబండి చక్రాల వంటి ట్రాక్టర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, దీనిని తాయారు చేసుకోవడానికి దాదాపు 70000 రూపాయలు ఖర్చు అయినట్లు కూడా ఆ రైతు తెలిపాడు. ఈ ట్రాక్టర్ చూసిన చాలామంది ఇలాంటి ట్రాక్టర్ కోసం చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. ఏది ఏమైనా రైతులు వారి వ్యవసాయానికి అనుకూలంగా యంత్రాలను, వాహనాలను తయారుచేసుకోవడం చాలా ఉత్తమం, ఎందుకంటే ఇలాంటి కొత్త వాహనాల వల్ల, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు.

Source: TV9 Telugu

Most Read Articles

English summary
Variety Tireless Tractor Only Wheels. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X