నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ప్రజా రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వీడియోలు చాలా వెలుగులోకి వచ్చాయి. అయితే వీరిపై కొంతమంది పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరు. కానీ కొంతమంది పోలీసులు చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తూ నియమాలను ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా వారిపై చర్యలు తీసుకుంటారు.

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని సెహెజనంద్ చౌక్‌లో జరిగినట్లుతెలుస్తోంది. ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం మీరు వీడియోలో గమనించవచ్చు.

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇద్దరు పోలీసులున్న మోటారుసైకిల్‌పై ఆపి విచారిస్తున్నట్లు చూడవచ్చు. ఇందులో ఒక పోలీస్ హెల్మెట్ ధరించి ఉండగా, ఇంకో వ్యక్తి హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరించని వ్యక్తి ఆ బైక్ యొక్క పిలియన్ అని తెలుస్తోంది.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనంపై వెళ్లే ప్రతి ఒక్కరూ అంటే డ్రైవర్ మరియు పిలియన్ తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కానీ అక్కడ ఉన్న పోలీసులలో ఒకరు హెల్మెట్ ధరించలేదు. పిలియన్ సీటుపై ప్రయాణిస్తున్న పోలీసును కిషోర్ శర్మగా గుర్తించారు. నిబంధనలను సరిగా పాటించనందుకు అతన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజు కుమార్ ఆపాడు, ఆ తరువాత, పోలీసు కిషోర్ శర్మ ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ ప్రారంభించాడు.

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

పొలిసు కావడం వల్ల నన్ను బహిరంగంగా ఆపడానికి నీకు హక్కు లేదని అతడు ట్రాఫిక్ పోలీస్ మీదకి గొడవకు దిగాడు. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివాన అయినట్లు, ఆ గొడవ పెద్దదయ్యింది. అయితే, ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ అతన్ని వెళ్లనివ్వలేదు, అంతే కాదు జరిమానా చెల్లించమని కోరాడు.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఈ గొడవలో ట్రాఫిక్ పోలీస్ మరియు పోలీస్ ఇద్దరూ కొట్టుకున్నారు. పోలీసుల కొట్టుకోవడం కూడా ఈ వీడియోలోచూడవచ్చు. పోలీసులు కొట్టుకోవడం వల్ల అక్కడకి ప్రజలు ఎక్కువగా వచ్చి గుమికూడి, ఆ సంఘటనలు వీడియో తీశారు. ఈ వీడియో క్లిప్ తరువాత ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన తరువాత, జార్ఖండ్ ట్రాఫిక్ ఎస్పీ, అజీత్ పీటర్ డండుంగ్ విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తనకు ఇవ్వమని అధికారులను కోరిన అతను ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

ప్రజా రహదారిపై చట్టబద్దమైన పదవుల్లో ఉన్న పోలీసులు నడిరోడ్డుపై ఈ విధంగా చేయడం నిజంగా అమానుషం. ఈ సంఘటనపై డీసీపీ ప్రస్తుతం నివేదికను సిద్ధం చేస్తున్నారు. డీసీపీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎస్పీ చర్యలు తీసుకుంటారు.

నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఏది ఏమైనా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా బైక్ పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. కానీ ఇక్కడ వీడియోలో మనకు కనిపించే పోలీస్ హెల్మెట్ ధరించలేదు. రూల్స్ పాటించమని ఆదేశించే పోలీసులే రూల్స్ పాటించకపోతే ఇక సామాన్య ప్రజల సంఘట తెలిసిందే.

MOST READ:గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 118 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం, ఇంకో 20 స్టేషన్స్ అక్కడ కూడా..

Image Courtesy: The Followup

Most Read Articles

English summary
Traffic Constable Stops Policeman For Not Wearing Helmet Starts Fighting Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X