లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీసుకు చుక్కలు చూపించిన యూట్యూబర్

టూ వీలర్ రైడర్ల దగ్గర వరుసబెట్టి లంచం తీసుకుంటుండగా, ఆనంద్ వీడియో తీశాడు. దీనిని గమనించిన పోలీస్ ఆనంద్ వద్దకు వచ్చి, వీడియో డిలీట్ చేయాలని అందుకు రూ. 500 లు డబ్బు కూడా ఆఫర్ చేశాడు. ఏ మాత్రం తగ్గని ఆనం

By Anil Kumar

ముంబాయ్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసుకి లక్ష్య ఆనంద్ అనే యూట్యూబర్ చుక్కలు చూపించాడు. అందరి టూ వీలర్ రైడర్ల దగ్గర వరుసబెట్టి లంచం తీసుకుంటుండగా, ఆనంద్ వీడియో తీశాడు. దీనిని గమనించిన పోలీస్ ఆనంద్ వద్దకు వచ్చి, వీడియో డిలీట్ చేయాలని అందుకు రూ. 500 లు డబ్బు కూడా ఆఫర్ చేశాడు. ఏ మాత్రం తగ్గని ఆనంద్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అయిపోయింది.

లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీసు

లక్ష్య ఆనంద్ అనే 19 ఏళ్ల అబ్బాయి తరచూ రోడ్ ట్రిప్స్ చేస్తూ వాటి వీడియో క్లిప్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. అనంద్ ఇప్పుడు ఇండియా రోడ్ ట్రిప్‌లో ఉన్నాడు. తన జర్నీలో భాగంగా ముంబాయ్ నుండి గోవా రోడ్ ట్రిప్పుకు వెళ్లాడు.

లంచం తీసుకున్న పోలీసు

గూగుల్ మ్యాప్ సలహా మేరకు, ముంబాయ్-పూనే ఎక్స్‌ప్రెస్‌వే మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు. ముంబాయ్-పూనే ఎక్స్‌ప్రెస్‌వే మీద టూ వీలర్లు మరియు త్రీవీలర్లకు అనుతిలేదు. అయినప్పటికీ, చాలా మంది బైకర్లు ఆ మార్గాన్నే ఎంచుకున్నారు.

లంచం తీసుకున్న పోలీసు

లోనావాలా/ఖండాలా సమీపంలో ఒక చోట పాత హైవే కలిసే చోట ఎక్స్‌ప్రెస్‌వే మీద చాలా మంది బైక్ రైడర్లు రోడ్డు మీదే ఆగిపోయారు. ఎక్స్‌ప్రెస్‌వే నుండి బయటపడే మార్గం తెలిసిన రైడర్లు వెళ్లిపోయారు. కానీ, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాన్ని వదిలేసి ప్రక్కకు వెళ్లాల్సిన దారి లభించకపోవడంతో అందరూ పూనేకు సమీపంలో ఉన్న టోల్ గేట్ వరకు వెళ్లారు.

లంచం తీసుకున్న పోలీసు

సరిగ్గా అక్కడే పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఎక్స్‌ప్రెస్‌వేలో టూ వీలర్లకు అనుమతి లేదు కాబట్టి, ఆ మార్గంలో వెళుతున్న బైకర్లందరినీ పోలీసులు ఆపేశారు. అందులో లక్ష్య ఆనంద్ కూడా ఉన్నాడు. ఆనంద్‌ను ఆపిన మహారాష్ట్ర పోలీసులు పద్దతి ప్రకారం లైసెన్స్ అడిగి తాను ఉల్లంఘించిన నియమం గురించి వివరంగా చెప్పారు.

లంచం తీసుకున్న పోలీసు

తరువాత, ఎక్స్‌ప్రెస్‌వే మీద టూ వీలర్లకు అనుమతి లేదు, ఈ మార్గంలో ప్రయాణించి ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా కడితే మీరు వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. ఇందుకు అంగీకరించిన ఆనంద్ జరిమానా మొత్తాన్ని చెల్లించి, చలానా తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్దమయ్యాడు.

లంచం తీసుకున్న పోలీసు

సరిగ్గా అప్పుడే, మరో బైకర్ పోలీస్ వద్దకు వచ్చాడు. జరిమానా కట్టకుండా అదే పోలీసుకు వంద రుపాయలు లంచం ఇచ్చాడు. అయితే, ఇదంతా ఆనంద్ తన కెమెరాలో బంధించాడు. తరువాత ఆనంద్ అక్కడికి వెళ్లి, బైకర్ వద్ద డబ్బు తీసుకొని చలానా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు.

లంచం తీసుకున్న పోలీసు

మీరు డబ్బు తీసుకొని చలానా ఇవ్వకపోవడం అంతా తన కెమెరాలో రికార్డయ్యింది. దానిని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ పోలీసుకు తెలిపాడు. ఆనంద్ మాటలకు ఖంగుతిన్న పోలీస్ వెంటనే ఆ రైడర్‌కు చాలానా ఇచ్చి జరిమానా కట్టించుకున్నాడు. ఆనంద్ వద్ద ఉన్న వీడియో కారణంగా, ఆ పోలీసులో క్షణాల్లో మార్పు వచ్చింది.

లంచం తీసుకున్న పోలీసు

తరువాత లక్ష్య ఆనంద్ అక్కడి నుండి తన జర్నీ కొనసాగించేలోపే, వెనక్కి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఆ వీడియో డిలీట్ చేయమని, లేదంటే ఎక్కడా పోస్ట్ చేయవద్దని మొరపెట్టుకున్నాడు. అంతే కాకుండా, ఆ వీడియోను డిలీట్ చేస్తే రూ. 500 లు ఇస్తానని బేరానికి వచ్చాడు. అందుకు నిరాకరించిన లక్ష్య అక్కడి నుండి వెళ్లిపోయి, ఇండియన్ రోడ్ల మీద నిజంగా జరుగుతున్నది ఇదే అని ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

లంచం తీసుకున్న పోలీసు

లక్ష్య ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర పోలీసుల పేరు మీదున్న ఇన్‌స్టాగ్రాం అకౌంట్ మీద పడింది. వీడియోను షేర్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసు విభాగం పబ్లిక్‌గానే లక్ష్య ఆనంద్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది.

లంచం తీసుకున్న పోలీసు

అంతే కాకుండా, లక్ష్య ఆనంద్ గురించి మరాఠీలో ప్రత్యేకంగా రాసిన సందేశాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇందులో మొదటి, లక్ష్య ఆనంద్ తీసుకున్న నిర్ణయం, వ్యవస్థ పట్ల ఉన్న శ్రద్ద మరియు గౌరవంతో పాటు ఆన్-డ్యూటీలో ఉన్న పోలీస్ రూ. 500 ఇవ్వజూపినా తీసుకోకవడం వంటి వాటిని వివరిస్తూ, మహారాష్ట్ర పోలీస్ విభాగం లక్ష్య ఆనంద్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది. అయితే, పోలీసులంతా ఇలాగే లేరు, మంచివారు కూడా ఉన్నారని గుర్తు చేశారు.

లంచం ఎందుకు తీసుకున్నావని వీడియో ద్వారా ప్రశ్నించడంతో, రూ. 500 తీసుకొని ఆ వీడియోను డిలీట్ చేయమని చెప్పడాన్ని రికార్డ్ చేసి, య్యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడున్న వీడియోలో మొత్తం తతంగాన్ని చూడగలరు.

లంచం తీసుకున్న పోలీసు

1.ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?

2. ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్

3.ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌‌ను అనుమతించే ఇతర దేశాలు

4."ఆపరేషన్ చీతా" - రెండు గంటల్లో ఐదు లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

5.అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!!

Most Read Articles

English summary
Read In Telugu: Traffic Cop Offers Bribe To Youtube Vlogger
Story first published: Saturday, April 21, 2018, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X