Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వాహనాలు పెరుగుతున్న కొద్దీ దేశ వ్యాప్తంగా ఉన్న రోడ్లు మాత్రమే విస్తరించడం లేదు. రోడ్లను విస్తరించకపోవడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ కి కారణమవుతుంది. కొన్నిసార్లు అంబులెన్సులు వంటి అత్యవసర వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటాయి.

ట్రాఫిక్ సమస్యకు కేవలం వాహనాలు మాత్రమే కాదు నిరసనలు కూడా కారణమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో రైతులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ కారణంగా ఢిల్లీ నగరంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ ని మళ్లించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారుభారతీ బంద్‌కు రైతులు పిలుపునివ్వడంతో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నారు, ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువైంది.

ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో భారత్ బంద్ సందర్భంగా ఒక యువకుడి తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఆ యువకుడు తన తల్లిని ద్విచక్ర వాహనంలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.
MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

కానీ భారత్ బంద్ కారణంగా వచ్చిన నిరసనలు భారీ ట్రాఫిక్ రద్దీని కలిగించాయి. ఆ యువకుడు అతని తల్లి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. యువకుడి తల్లి ఆరోగ్యం క్షీణించడాన్ని పోలీసులు గమనించి, ఆ యువకుడి సహాయానికి ముందుకు వచ్చారు.

సాయి తేజ అనే యువకుడి తల్లి భారతి ఉదయం 9 గంటలకు మూర్ఛ పోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. మళ్ళీ కాల్ చేసినప్పుడు రోగిని తీసుకురాబోతున్నట్లు అంబులెన్స్ తెలిపింది. సాయి తేజ అనేక హాస్పిటల్స్ యొక్క అంబులెన్స్‌లకు కాల్ చేసాడు. అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం వల్ల అతని తల్లిని ద్విచక్ర వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

కానీ నిరసన వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ గురించి ఆయనకు తెలియదు. దీంతో అతడు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు. దీని గురించి సాయి తేజ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ జరిగి ఉండవచ్చని అనుకున్నానని చెప్పాడు. కానీ నిరసన కారణంగా వాహనాలు కదలడం లేదని తరువాత తెలిసిందని ఆయన అన్నారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో సాయి తేజ ట్రాఫిక్ పోలీసుల సహాయం కోరాడు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాయి తేజ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారు. కంట్రోల్ రూం ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి అన్ని రకాలగా సహకరించారు. పోలీసులు ట్రాఫిక్‌ను సరిచేసి ఆసుపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తరలించడానికి పోలీసులకు వీలు పడింది.
MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?
NOTE : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే