ట్రాఫిక్ లైట్లు ఎప్పుడు వచ్చాయ్? మొదట ఎక్కడ స్టార్ట్ చేశారు? వాటి వెనక అసలు కథ ఇదే
ట్రాఫిక్ లైట్లు మన రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంలో చాలా కీలకం. రోడ్లపై వాహనలను కంట్రోల్ చేయడంలో, వేగం నియంత్రణ ఇలా అన్ని విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్ల ద్వారా వాహనాలను, బైక్‌లను, బస్సులను, ట్రక్కులను ఎలా, ఎప్పుడు ఆపాలనేది, ఎప్పుడు జాగ్రత్తగా నడిపాలనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రాఫిక్ లైట్లు ఉన్న రహదారులు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. ముఖ్యంగా, పాదచారులు, సైకిల్ రైడర్లు, చిన్న వాహనాలు రోడ్లను సురక్షితంగా దాటగలరు. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో వాహనాల సంఖ్య కూడా క్రమంగా భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో టూవీలర్, ఫోర్ వీలర్, త్రీవీలర్ల సంఖ్య పెరిగిపోతుంది.
ఇలాంటి సమయంలో ట్రాఫిక్ లైట్లు చాలా కీలకంగా మారాయి. అయితే ఈ ట్రాఫిక్ లైట్లు అసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయే, వాటి గురించిన చరిత్రను ఈ కథనంలో తెలుసుకుందాం. 19వ శతాబ్దం చివరి దశలో, వేగంగా పెరుగుతున్న రోడ్ల పై కారు, రైలు, రిక్షా, వాహనాల జాములను నియంత్రించేందుకు మొదటి ప్రయత్నాలు మొదలయ్యాయి. 1868లో, లండన్‌లో వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంతంలో మొదటి రోడ్ సిగ్నలింగ్ వచ్చింది.

ఇది గ్యాస్-లైట్స్ ఆధారంగా పనిచేసేది, సౌకర్యం చాలా తక్కువగా, రాత్రి మాత్రమే కనిపించేది. అయితే దాని ఫలితాలు ఆశించిన మేరకు ఇవ్వకపోవడంతో 20వ శతాబ్దం ప్రారంభంలో, అమెరికాలోని షికాగో నగరంలో 1914లో, జేమ్స్ హోగ్ అనే ఇంజినీర్ మొదటి సిగ్నల్‌ను ఇన్స్టాల్ చేశాడు. ఇది మనకు తెలిసిన చెరుకు-ఎరుపు-పసుపు మూడు రంగుల లైట్లుకి ముందు అడుగు. కానీ ఆ లైట్ మాన్యువల్‌గా ఆపరేట్ చేయబడేది.
అంటే రోడ్డుపైపోలీస్ చేతిలో ఆధారపడి వాహనాలను ఆపడం లేదా నడిపించడం జరుగుతుండేది. తరువాత మారుతున్న కాలానికి అనుగుణంగా 1920లలో విద్యుత్ ఆధారిత ట్రాఫిక్ లైట్లు అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త లైట్ల ద్వారా రోడ్లపై వాహనాల నియంత్రణ చాలా సులభమైంది. మొదట్లో ట్రాఫిక్ లైట్లకు ప్రజలు అలవాటు కావాడానికొ కొంత సమయం పట్టింది. కానీ రాను రాను వీటి ద్వారా జరిగే ప్రయోజనాలను వారు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.

విద్యుత్ ఆధారిత ట్రాఫిక్ లైట్ల ఏర్పాటుతో ఆ రోడ్డుపై చాలా వరకు వాహనాలు ఢీకొనడం లాంటివి తగ్గిపోయాయి. అలాగే, రోడ్డు ప్రయాణం సురక్షితం అయ్యింది. ప్రధానంగా, ఎరుపు - వాహనాలను ఆపడం, పసుపు - జాగ్రత్త అని హెచ్చరించడం, ఆకుపచ్చ - వాహనాలు ముందుకు కదలమని చెప్పడం అనే రంగుల భాష మన జీవితంలోకి వచ్చి, రోడ్లపై నిబంధనలు సులభంగా పాటించబడేలా చేసింది.
అతిపెద్ద పురోగతి 1960లలో గ్లోబల్ స్థాయిలో కనిపించింది. ఆ సమయంలో ట్రాఫిక్ లైట్లు కేవలం రహదారి నియంత్రణకు కాకుండా, వాహనాల వేగం, పాదచారుల కోసం ప్రత్యేక విధానాలు, ట్రాఫిక్ సెన్సర్లు వంటి సాంకేతికతలతో సమన్వయం చేయడం ప్రారంభమైంది. ఇప్పటికీ మనం చూడగల, ప్రతి ప్రధాన నగర కూడలిలో ఉండే ఆ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్, ఈ చారిత్రక పరిణామం ఫలితమే.

మొదట్లో మాన్యువల్‌గా పోలీసులు నియంత్రించిన ఈ లైట్లు, తరువాత కంప్యూటరైజ్డ్ డిటెక్షన్ సిస్టమ్ వల్ల ఆటోమేటిక్‌గా మారాయి. వాహనాల సంఖ్యను గుర్తించి, రద్దీని అంచనా వేసి, సిగ్నల్ సమయాన్ని మార్చడం ప్రారంభించడంతో ట్రాఫిక్ ప్రవాహం మరింత సులభంగా మారింది. ఇక భారత్ విషయానికి వస్తే, ట్రాఫిక్ లైట్ల ప్రయాణం కాలక్రమేణా కొత్త సాంకేతికతలతో అభివృద్ధి చెందింది.
దక్షిణ భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్‌ను 1953లో చెన్నైలోని ఎగ్మోర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు. ఇది ఆ కాలంలో నగరానికి ఒక కొత్త మార్పు. వాహనాలు పెరుగుతున్న సమయంలో క్రమాన్ని తీసుకురావడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. తరువాత, 1963లో బెంగళూరులో మొదటి ట్రాఫిక్ లైట్ వెలుగులోకి వచ్చింది. ఆ లైట్ కార్పొరేషన్ సర్కిల్ వద్ద అమర్చబడింది.


Click it and Unblock the Notifications








