ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా మారాయి, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారు ఎవరైనా శిక్షార్హుడే. దీనికి నిదర్శనమే కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంఘటన. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసు సిబ్బందిలో ఒకరు అటుగా వెళ్తున్న మరో పోలీసుకి జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో ఆ పొలిసు హెల్మెట్ కూడా ధరించి ఉన్నాడు, అయితే అది హాఫ్ హెల్మెట్. ఈ కారణంగా ట్రాఫిక్ పొలిసు ఆ పోలీసుకి జరిమానా విధించారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియావైలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజానికి ఒక పొలిసు మరో పోలీసుకి జరిమానా విధించిన సంఘటనలు చాలా తక్కువ, అలంటి సంఘటనలో ఇది ఒకటి కావడం విశేషం. దీనిపైన నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

సోషల్ మీడియావైలో వెలువడిన ఈ పోస్ట్ కి దాదాపు 1000 కి పైగా లైకులు వచ్చాయి. చాలామంది కామెంట్స్ కూడా చేశారు. నిజంగా ఒక పొలిసు ఇంకో పోలీసుకి జరిమానా విధించడం అనేది గొప్ప విషయమే, హాఫ్ హెల్మెట్ ధరించిన పోలీసుకే చలానా విధిస్తే, ఇక సామాన్యులకు కూడా తప్పకుండా వర్తిస్తుంది. దీనిని తప్పకుండా బైక్ రైడర్స్ గుర్తుంచుకోవాలి.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగిపోతున్నాయి. అయితే ఈ ప్రమాదాలు నివారించడానికి సంబంధిత ప్రభుత్వాలు కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హెల్మెట్ ధరించకపోతే భారీగా జరిమానా విధిస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

ఇదిలా ఉండగా బెంగళూరు నగరంలో మీరు కారులో ప్రయాణించే సమయంలో రెండవ వరుసలో ఉన్న ప్రయాణికులు కూడా తప్పకుండా సీటు బెల్టుని ధరించాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి రూ. 1,000 జరిమానా విధిస్తారు, కాగా రెండవ సారి ఇదే ఉల్లంఘన జరిగితే వారికి రూ. 2,000 జరిమానా విధించబడుతుంది.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు మాత్రమే సీటు బెల్ట్ ధరించాలని నిబంధన ఉండేది. అయితే రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇది రానున్న రోజుల్లో రోడ్డుప్రమాదంలో జరిగే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

రెండవ వరుసలో కూడా సీట్ బెల్ట్ అవసరం అనే రూల్ బెంగళూరులో గత బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఆదేశాలను ఏడీజీ (రోడ్ సేఫ్టీ) 'హితేంద్ర' జారీ చేశారు. ఈ నియమం ఇప్పుడు SUV, ఎంయూవీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ సహా అన్ని రకాల కార్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారికి ఎక్కువ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. అయితే బెంగళూరులో జరిగిన సంఘటన ఇప్పుడు ఇతరులకు కూడా ఆదర్శం కానుంది. కావున ప్రజలందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2022, 11:57 [IST]
English summary
Traffic police fined police constable for wearing half helmet in bengaluru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+