స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ తీవ్రత ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఈ మహమ్మరి మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థార్డ్ వేవ్ గురించి హెచ్చరిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా అనేక నిబంధనలు ఇప్పటికి అమలులో ఉన్నాయి.

స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

కరోనా నివారణలో భాగంగా ఇప్పటికి పేస్ మాస్క్ ధరించి సామజిక దూరం వంటివి తప్పకుండా పాటించాలి. దీని కోసం పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్క్ ధరించకుండా తిరిగే ప్రయాణికులను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి స్కూటర్‌ను ఆపాడు కానీ అతడు ఆపకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పోలీస్ ఆ స్కూటర్ తన్నాడు. దీనితో ఆ స్కూటర్ కిందపడింది.

స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

ఈ సంఘటన అస్సాంలోని గువహతిలో జరిగినట్లు తెలుస్తోంది. పేస్ మాస్క్ ధరాయించకుండా వెళ్లే వాహనదారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగానే విధుల్లో ఉన్న పోలీస్ ఈ విధంగా చేశారు. కానీ పోలీసుల ఈ అమానవీయ చర్య వల్ల స్కూటర్‌లో ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడ్డారు. దీంతో వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.

స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

పోలీసుల చేసిన ఈ చర్యకు అక్కడి స్థానికులు ఆ పోలీసులపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. విధుల్లో ఉన్న పోలీసులు వాహనాన్ని చెక్ చేయడానికి ఆపినప్పుడు ఆ వాహనదారులు ఆపకుండా ముందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మరో పోలీస్ ఆ స్కూటర్ ని ఆప్ ప్రయత్నంలో తన్నాడు.

స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

పోలీసులు స్కూటర్ ఆపినప్పుడు ఆపకపోవడం తప్పు, కానీ పోలీసులు ఈ విధంగా చేయడం సబబుగా లేదు. ఈ సంఘటనలో ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే చాలా అనుకోని సంఘటనలు జరిగేవి. కానీ స్కూటర్ పై ఉన్న రైడర్ హెల్మెట్ ధరించి ఉన్నాడు కావున పెద్దగా ప్రమాదం జరగనప్పటికీ స్వల్ప గాయాలయ్యాయి.

వీడియో చూసిన చాలామంది ప్రజలు పోలీసుల చర్యను తప్పు పట్టారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎక్కువ ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల కారణంగా ద్విచక్ర వాహనంపై ఒక్కరు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ వీరు పట్టుబడ్డారు. వీరు మాత్రానే కాదు ఇలాంటి వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న వాహనదారులు లెక్కకుమించి ఉన్నారు.

స్కూటర్‌ను ఆపడానికి స్కూటర్‌నే తన్నిన పోలీస్ [వీడియో]

ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులకు అస్సాం పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఇంతలో, ఈ సంఘటన జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Assam Cop Kicks Scooter To Stop The Riders. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X