మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

మలయాళ సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులలో మమ్ముట్టి ఒకరు. అతని కుమారుడే దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ మరియు తమిళం సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు కూడా. ఇటీవల దుల్కర్ సల్మాన్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దుల్కర్ సల్మాన్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటి సారి కాదు.

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

గతంలో కూడా దుల్కర్ సల్మాన్ ఒక ప్రజా రహదారిపై కారు రేసు చేయడం వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు అతడు మరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మళ్ళీ వివాదంలో చిక్కుకున్నారు. సిగ్నల్ దాటడానికి దుల్కర్ సల్మాన్ రాంగ్ సైడ్ లో కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

ఈ వీడియోలో రాంగ్ సైడ్‌లో వస్తున్న దుల్కర్ సల్మాన్ కారును ఒక పోలీసు గమనించి తిరిగి వెళ్ళమని చెప్పాడు. పోలీస్ తెలియజేసిన తరువాత, దుల్కర్ సల్మాన్ కారును వెనక్కు తిప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు. అక్కడున్న కొంతమంది యువకులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.

MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే దుల్కర్ సల్మాన్ కొంత సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు దుల్కర్ సల్మాన్ పోర్స్చే పనామెరా టర్బో లగ్జరీ కారు నడుపుతున్నాడు.

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

ఈ సూపర్ కారులో తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉంది. దుల్కర్ సల్మాన్ మరియు మమ్ముట్టి ఇద్దరూ ఉపయోగించే చాలా కార్లు రిజిస్ట్రేషన్ సంఖ్య 369. ఈ సంఖ్య ద్వారా, ఈ కారు దుల్కర్ సల్మాన్‌కు చెందినదని నిర్దారించబడింది. ఈ సంఘటన అలప్పుజలోని బైపాస్ రోడ్డులో జరిగింది. దుల్కర్ సల్మాన్ యొక్క ప్రవర్తన అతని అభిమానులను అబ్బురపరిచింది.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

దుల్కర్ సల్మాన్ వినియోగిస్తున్న పోర్స్చే పనామెరా టర్బో ధర రూ. 2.13 కోట్లు. ఆన్‌లైన్ ధర దీని కంటే ఎక్కువగా ఉంటుంది. పోర్స్చే పనామెరా టాప్ ఎండ్ సూపర్ కారు. దుల్కర్ సల్మాన్ ఈ కారును 2018 లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కారు ప్రస్తుతం హైబ్రిడ్ వెర్షన్లలో అమ్ముడవుతోంది.

పోర్స్చే పనామెరా కారులో 4.0 లీటర్ వి 8 ఇంజన్ ఉంటుంది. ఇది 543 బిహెచ్‌పి పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ నటుడు వివాదంలోకి చిక్కుకోవడం నిజంగా విడ్డూరంగా ఉంది.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ..!

మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

ఇటీవల, కేరళ రవాణా శాఖ అధికారులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ వీడియోల ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటుడు దుల్కర్ సల్మాన్ పై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎంతవారైనా వాహనాలను నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిన్చ్ నియమాలను పాటించాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే వికాసం ఉంటుంది.

ఇందులో ప్రత్యేకంగా సినీ నటులు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి అభిమానులు కూడా వారిని అనుసరిస్తే ఇంకా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది.

Most Read Articles

English summary
Traffic Police Made Actor Dulquer Salmaan's Porsche Panamera Car To Go Back. Read in Telugu.
Story first published: Thursday, March 4, 2021, 17:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X