ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి, ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ సామాన్య ప్రజలమీదే ఎక్కువ ప్రభావం చూపుతాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేదని, హెల్మెట్ ధరించలేదని, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని.. ఇలా చెప్పుకుంటూ పొతే ఏదో ఒక కారణంతో పోలీసులు సామాన్య ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి జరిమానాలు వసూలు చేస్తారు. కానీ ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన సంఘటలు ఒక్కసారిగా వైరల్ అయిపోతున్నాయి. దీని గురించి మరింత సమాచారం పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

నివేదికల ప్రకారం, ఇటీవల ఒక వ్యక్తి తన ట్విట్టర్‌లో చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇందులో ఆ వ్యక్తి తెలంగాణా డిజిపి (DGP) తన వాహనం అయిన TS09PA 1234 కి జరిమానా చెల్లించాల్సి ఉందని, ఇది గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని, మొత్తం రూ. 7,000 ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపాడు.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

సాధారణ ప్రజల వద్ద మాత్రం ఖచ్చితంగా జరిమానాలు వసూలు చేసే పోలీసులు డిజిపి వాహనంపైన చలానాలు వసూలు చేయలేదని, అవి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు భాగ్యనగరంలో (హైదరాబాద్) హాట్ టాపిక్ గా మారిపోయింది.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

దీనిపైన తెలంగాణ జాయింట్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని పోలీస్ వాహనాలన్నీ కూడా డీజీపీ పేరుతోనే రిజిస్టర్‌ అయ్యాయని వివరించారు. కాగా ట్విట్టర్ లో ఆ వ్యక్తి తెలిపిన వాహనంపైన ఉన్న ఏడు ట్రాఫిక్ చలాన్‌లు సంబంధిత పోలీసు అధికారి ఇప్పటికే చెల్లించారని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

పోలీసులకు మాత్రమే కాకుండా తెలంగాణలోని 'టిఎస్‌ఆర్‌టిసి'కి కూడా క్రమం తప్పకుండా జరిమానా విధిస్తున్నట్లు, ఇందులో భాగంగానే 2022 ఏప్రిల్‌ నెలలో అప్పటివరకు పెండింగ్ లో ఉన్న అన్ని చలాన్‌లను క్లియర్ చేసి రూ. 15 లక్షలు చెల్లించినట్లు కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంగిస్తే వారికి జరిమానా తప్పదు, ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా వర్తిస్తుంది. కావున వారు కూడా తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఉల్లంఘిస్తే జరిమానాలు చెల్లించాల్సిందే. కాబట్టి రాష్ట్రంలో ఎవరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా నిష్పక్షపాతంగా జరిమానాలు వసూలు చేస్తున్నామని తెలిపారు.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణలోని పోలీసులు ఇప్పటి వరకు మొత్తం చలాన్లకు సంబంధించి ఏకంగా రూ. 28.85 లక్షలు చెల్లించి క్లియర్ చేశారని పేర్కొన్నారు. కావున ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, చట్టం దృష్టిలో అందరూ సమానం కాబట్టి తప్పకుండా అందరికి అన్ని నియమాలు వర్తిస్తాయి.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

ప్రస్తుతం భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా మారాయి, కావున వాహన వినియోగదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

ఇదిలా ఉండగా భారతదేశంలోని అన్ని ప్యాసింజర్ వాహనాలు తప్పకుండా 6 ఎయిర్ బ్యాగులను కలిగి ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ నియమం 2023 అక్టోబర్ నాటికి అమలులోకి వస్తుందని కూడా అన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిబంధన తీసుకురావడం జరిగిందని గడ్కరీ అన్నారు.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారాటుదేశం కూడా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎక్కువమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల రక్షణకు పెద్ద పీట వేయడానికి కార్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలి అని ఆదేశించింది.

ట్రాఫిక్ చలాన్ చెల్లించని తెలంగాణ DGP అంటూ.. పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ట్రాఫిక్ రూల్స్ ఎక్కువగా సాధారణ ప్రజలకు మాత్రమే అని అందరూ అనుకుంటారు, అయితే తెలంగాణా డిజిపి తెలిపిన దాని ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరైనా శిక్షార్హులు అని తెలుస్తోంది. దీనిపైన పూర్తి వివరణ కూడా తెలిపారు, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ విధానాలను పాటిస్తే, ప్రజలకు పోలీసులపైనే మరింత ఎక్కువ నమ్మకం ఏర్పడుతుందని భావిస్తున్నాము. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మాత్రమే కాకుండా, కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Traffic police s clarification after screenshot showing telangana dgp didn t cleared traffic challan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X