చైనా: జీవితంలో 9 రోజులు ట్రాఫిక్‌కే అంకితం!

By Ravi

ట్రాఫిక్ జామ్.. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కునే ఉంటారు. నగరాల్లో ఉండే వారైతే ప్రతిరోజు దీని బారిన పడుతుంటారు. ఇది ప్రయాణీకులను అత్యంత అసౌకర్యాన్నికి గురిచేస్తుంది. పెరుగుతున్న జనభాతో పాటుగానే ట్రాఫిక్ జామ్ కూడా నిరంతరాయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి చైనాలో ట్రాఫిక్ బెడద విపరీతంగా ఉంటుందోంది.

ఎంత విపరీతంగా అంటే, ఆ దేశంలో ప్రతి మోటారిస్ట్ తన జీవితంలో దాదాపు 9 రోజులు ట్రాఫిక్‌కే అంకితమైనపోయ్యేంత విపరీతంగా. ప్రముఖ నావిగేషన్ పరికరాల తయారీ సంస్థ టామ్‌టామ్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, చైనాలో ప్రతి సగటు వ్యక్తి దాదాపు 9 పనిదినాలకు సమానమైన సమయాన్ని ట్రాఫిక్‌ జామ్ ద్వారా వృధా చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

Traffic Takes Away Nine Days Of Your Life in China

చైనాలోని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ కోఆపరేషన్ అంచనా ప్రకారం, 2030 నాటికి దాదాపు 250 మిలియన్ల మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలిపోనున్నారు. ఫలితంగా, దేశంలో కార్ల వినియోగం కూడా పెరిగి ట్రాఫిక్ మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చైనా కార్ రిజిస్ట్రేషన్లు, కొత్త భవంతులు మరియు రోడ్డు నిర్మాణాల విషయంలో ఆంక్షలు పెట్టినప్పటికీ, ట్రాఫిక్ మాత్రం పెద్ద సవాలుగానే మారుతోంది.

శాటిలైట్ నావిగేషన్ సేవలు అందించే అతిపెద్ద సంస్థ టామ్‌టామ్ ఈ సర్వేను చేపట్టింది. టామ్‌టామ్ ఇప్పుడు చైనాలోని మోటారిస్టులకు లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇవ్వటం ద్వారా వారి రోజూవారీ ప్రయాణంలో ఏ రూట్‌లో వెళితే ట్రాఫిక్ బెడద నుంచి తప్పించుకుంటారోనన్న సమాచారన్ని అందిస్తోంది. ఆ దేశఫు ప్రముఖ నావిగేషనల్ సర్వీస్ ప్రొవైడర్ ఆటోనావీతో కలిసి టామ్‌టామ్ పనిచేస్తోంది.

Most Read Articles

English summary
A recent study by TomTom about traffic in China has revealed a very interesting fact. An average person spends the equivalent of nine working days in traffic. China has the fastest growing economy. As the Organisation for Economic Cooperation in China says, more than 250 million people would have moved to urban areas by 2030.
Story first published: Wednesday, July 9, 2014, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X