పోలీసులకే షాక్.. హైద‌రాబాద్‌లో ఒకే యువతికి 22 చలాన్లు జారీ

మనదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వాహనదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డుప్రమాదాలని నివారించడానికి ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించలేకపోతున్నారు.

హైద‌రాబాద్‌లో ఒకే యువతికి 22 చలాన్లు జారీ

రోడ్డు ప్రమాదాలు జరగటానికి ఏప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయడం మరియు అత్యధిక వేగంతో వాహనాలను డ్రైవ్ చేయడం. ప్రతి రోజు కొన్ని వందల పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలపై ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఏదో ఒక మూల ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

నివేదికల ప్రకారం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసులు ఒక యువతికి ఏకంగా 22 సార్లు వివిధ కారణాల ఆధారంగా జరిమానా విధించారు. నిజాంపేటకు చెందిన ఒక యువతి ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ పోలీసులకు పట్టుబడింది. అయితే పోలీసుల తానికీలో ఆ యువతీ సెల్‌ఫోన్ డ్రైవింగ్‌, హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌డం వంటి వాటితో మొత్తం 22 సార్లు ఉల్లంఘించినట్లు తెలిసింది.

ఈ క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసులు ఆ యువ‌తికి ఆమె త‌ల్లిదండ్రులు స‌మ‌క్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు సంబంధించి చ‌లాన్ల మొత్తం దాదాపు రూ. 9,070 క‌ట్టించుకొని పంపించారు.

ఇక్కడ జరిగిన సంఘటన విషయానికి వస్తే ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా 22 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉందొ ఆ యువతి అర్థమవుతుంది. ఇలాంటి వారిని పోలీసులు ఊరికే వదిలివేయకూడదు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే మిగిలినవారిలో కొంత భయం ఏర్పడుతుంది.

రోడ్డుపై వెళ్లే చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. పోలీసులు లేదు కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ చేయబడతాయి. ఇలాంటి వారికి తప్పకుండా ఈ చలాన్లు జారీ చేయబడతాయి. వాహనదారుడు ఆ ప్రస్తుతానికి తప్పించుకున్నట్లు సంతోషించవచ్చు కానీ తప్పకుండా దాని ప్రతిఫలం అనుభావించి తీరుతాడు, కావున వాహనదారులు ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి.

Most Read Articles

English summary
22 Challans For Young Woman For Violating Traffic Rules In Hyderabad. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X