ఇంజిన్‌ లేకుండా పరుగులు తీసిన రైలు బోగీలు.. కారణం చెప్పిన స్టేషన్‌ మాస్టర్‌..!

భారత్‌లో రైల్వేలకు సంబంధించిన కొన్ని ఘటనలు ఇటీవల కాలంలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత రైల్వేల భద్రతపై అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఇంజిన్‌ లేకుండా రైలు బోగీలు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జార్ఘండ్‌ రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బర్హద్వా రైల్వే స్టేషన్‌లో నాలుగు రైలు బోగీలు ఇంజిన్ లేకుండా పట్టాలపై పరుగులు తీయడం ప్రారంభించాయి. ఈ నాలుగు బోగీలు వెనుక.. గూడ్స్‌ రైలు ర్యాక్‌ కూడా పరుగులు తీసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

train coaches running without engine

జార్ఘండ్‌లోని బర్హద్వా రైల్వే స్టేషన్‌లో రెండు గూడ్స్‌ రైలు ర్యాక్‌లను ట్రాక్‌పై నిలిపి ఉంచారు. దాంతోపాటు ప్రత్యేక రైలుకు చెందిన నాలుగు కోచ్‌లను నిర్వహణ కోసం అదే ట్రాక్‌పైన నిలిపి ఉంచారు. అయితే నాలుగు బోగీలు వెనుక ఉన్న గూడ్స్ రైలు ర్యాక్‌ ఒకటి రైల్వే ట్రాక్‌పై క్రమంగా ముందుకు కదిలింది. అలా వెళ్లి... ప్రత్యేక రైలు బోగీలను ఢీకొట్టింది. దీంతో ఆ బోగీలు కూడా పట్టాలపై ముందుకు కదలడం ప్రారంభించాయి.

అలా ఇంజిన్‌ లేకుండానే మరో స్టేషన్‌ వైపు బోగీలు వెళ్లాయి. అయితే ప్లాట్‌ఫాం కంటే కొంత దూరం ముందు ఈ బోగీలు నిలిచిపోయాయి. ఈ ఘటనలపై బర్హద్వా స్టేషన్‌ మాస్టర్‌ స్పందించారు. రైల్వే ట్రాక్‌ ఉన్న ప్రాంతంలో ఏటవాలుగా ఉండడం కారణంగా బోగీలు ముందుకు కదిలినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

train coaches running without engine

ఇంజిన్ లేకుండా రైలు బోగీలు ముందుకు కదలడంపై సమీపంలోని గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాల్దా డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత రైల్వేల భద్రతపై అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 2న బాలోసోర్‌ వద్ద కోరమాండల్‌ రైలు ఆగిఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో కోరమాండల్‌ రైలు బోగీలు పక్కనున్న ట్రాక్‌పైన పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 296 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు.

train coaches running without engine

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 4, 2023, 16:35 [IST]
English summary
Train coaches running without engine in jharkhand video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+