Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు
చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 24,000 మందికి పైగా ప్రజలు మరణించారు. 4 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు.

ఈ కరోనా వైరస్ వల్ల రోజు రోజుకు చనిపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో కూడా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స చేయడానికి ఐసియు మరియు ఐసోలేషన్ వార్డులు అవసరం. కానీ పెరుగుతున్న రోగులకు ఇలాంటి సదుపాయాలు సరిపోకపోవడంతో రైల్వే శాఖ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.

రైల్వే శాఖ ప్రతి బోగీని ఒక వార్డులుగా మార్చింది. బోగీల్లోని సీట్లన్నీ తొలగించబడ్డాయి. దిగువ సీట్లు మాత్రమే వున్నాయి. అంతే కాకుండా బోగీలలో అనేక మార్పులు కూడా చేయబడ్డాయి.

కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసే నర్సులకు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఈ బోగీలలో స్థలాలు ఇవ్వబడతాయి. అదనంగా ప్రతి వార్డులో మరింత భద్రతను పెంచడానికి భద్రతా సామగ్రి కర్టెన్లు కూడా తయారు చేయడం జరిగింది.

బోగీలలోని స్నానపు గదులు కూడా మాడిఫై చేయబడ్డాయి. ఐసోలేషన్ వార్డులుగా మార్చబడిన ఈ రైలు చిత్రాలు ఇటీవల మీడియాలో వచ్చాయి. రైళ్లను పూర్తిగా ఇప్పుడు నిలిపివేయడం వల్ల ఇవి ప్రజలకు వాటిని సింగిల్ వార్డులుగా మార్చవలసి వచ్చింది.

మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా రైలు కార్యకలాపాలను నిలిపివేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ వ్యవధిని ఏప్రిల్ 14 వరకు పొడిగించే అవకాశం ఉంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు కదులుతున్నాయి. ఆ రైళ్లను కూడా ఈ విధంగా ఉపయోగించవచ్చు. బుక్ చేసుకున్న వ్యక్తులు తమ రైలు టిక్కెట్లను రద్దు చేయాలని ఐఆర్‌సిటిసి ఇటీవల తెలిపింది.
MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్

బుకింగ్‌లను రద్దు చేసిన వ్యక్తుల యొక్క డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. కౌంటర్ల నుండి కొనుగోలు చేసిన టికెట్లను జూన్ నాటికి రద్దు చేయవచ్చు.
MOST READ:కొత్త సిబిఆర్ 250 ఆర్ఆర్ బైక్‌ను ఆవిష్కరించిన హోండా

కరోనా వైరస్‌తో పోరాడటానికి ఆటో మొబైల్ కంపెనీలు కూడా ప్రభుత్వంతో చేతులు కలిపాయి. మహీంద్రా, మారుతి, బజాజ్ వంటి సంస్థలు వెంటిలేటర్ల ఉత్పత్తిని ప్రారంభించాయి.
MOST READ :భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ఇకపై 5 డోర్స్ లో కూడా

భారతదేశంలో అధికంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నివారణకు భరత ప్రభుత్వానికి ప్రయివేటు కంపెనీలు కూడా మద్దతు తెలియజేస్తూ వైద్య సదుపాయాలకు కావలసిన వాటిని తయారు చేస్తుంది.