Just In
- 22 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి
భారతదేశంలో రైల్వే ప్రమాదం వల్ల ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. రైల్వే క్రాసింగ్లలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్వే క్రాసింగ్ల వద్ద జంతువులు, మనుషులు కూడా ఎక్కువగా ప్రమాదం భారిన పడటమే కాకుండా, ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. ఇటీవల ఒక రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన సంఘటన యొక్క వీడియో బయటపడింది.

ఈ వీడియోలో ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడి గందరగోళమే ఈ విపత్తుకు కారణమైంది. అతను ట్రైన్ వెళ్లిపోయే వరకు వేచి ఉండకుండా, ట్రైన్ సమీపానికి చేరుకున్నాడు, ఆ సమయంలో ట్రైన్ తన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడం వీడియోలో చూడవచ్చు.

అదృష్టవశాత్తూ ఆ యువకుడిని తప్పించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. రైల్వే క్రాసింగ్ల వద్ద ఎందుకు ఓపికపట్టాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో మనం స్పష్టంగా అర్థం చెబుతుంది. ఈ వీడియోలో మీరు ట్రైన్ రాకముందే ఆ ప్రాంతానికి ఒక వైపు గేట్ ఉండటం చూడవచ్చు.
MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ఈ రేల్వే ట్రాక్ కి ఇంకో వైపు గేట్ లేదు, ట్రైన్ రాకముందే కొంతమంది ట్రాక్ దాటడాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో ఒక యువకుడు ద్విచక్ర వాహనంలో వచ్చాడు. ట్రైన్ రాకముందే రైల్వే ట్రాక్‌లు దాటాలా, వద్దా అని యువకుడు అయోమయంలో పడ్డాడు. కానీ ట్రైన్ సమీపించడం చూసి, అతను తన బైక్‌ను అక్కడే వదిలేసాడు.

ఆ యువకుడు బైక్‌ను అక్కడే వదిలివేయడంతో వేగంగా వస్తున్న ట్రైన్ దానిని వేగంగా ఢీకొట్టగానే అది నుజ్జునుజ్జయింది. కానీ బైక్ కింద పడటంతో యువకుడు వెనుకకు వెళ్లిపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్ సహా పలు సోషల్ సైట్లలో వైరల్ అయ్యింది. ఈ వీడియో రైల్వే క్రాసింగ్ల వద్ద సహనం యొక్క అవసరాన్ని ఎంత ఉందొ తెలుపుతుంది.
MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

రైల్వే క్రాసింగ్‌లు దాటటానికి ప్రజలు తొందరపడటంతో చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ సమయంలో చాలా మంది మోటార్ సైకిల్స్ మరియు పాదచారులు రైల్వే ట్రాక్ దాటుతారు. మీరు ట్రైన్ కి చాలా దగ్గరగా నిలబడితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. ఎంత తీవ్రంగా ప్రమాదం జరుగుతుందో ఈ వీడియోలో చూడవచ్చు.
ఒక బైకు ఇంత తీవ్రంగా ప్రమాదానికి గురైతే, ఆ స్థానంలో మనిషి ఉంటె ఏమవుతుందో మీరే ఊహించండి. అదృష్టవశాత్తూ ఆ యువకుడు మిగిలాడు. ఇతర వాహనాల మాదిరిగా ట్రైన్లను వెంటనే ఆపలేమని ప్రజలు అర్థం చేసుకోవాలి. కావున ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రజలు ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా ట్రైన్ పూర్తిగా వెళ్లే వరకు కొన్ని నిమిషాలు వేచి ఉండటం మంచిది. లేకపోతే అక్కడ జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందంటే, ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.