రైలు వెళ్తున్నప్పుడు ‘డగ్‌ డగ్‌’ సౌండ్‌ ఎందుకు వస్తుందో తెలుసా? టాప్‌ సీక్రెట్‌ వీడియో

రైలు వెళ్లేటప్పుడు ధడక్‌ ధడక్‌ అని శబ్దం వినే ఉంటాం. అయితే ఆ సౌండ్‌ ఎలా వస్తుంది అది రావడానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు. తాజాగా ఈ సౌండ్‌ ఎలా వస్తుందో తెలియజేసే వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌ (ఎక్స్‌)లో షేర్‌ చేశాడు. తాజాగా విడుదల చేసిన ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుంది.

ముఖ్యంగా ఈ వీడియోలో చూపించిన విజువల్స్‌ ప్రకారం ట్రాక్‌ల మధ్య ఉండే శబ్దం గ్యాప్‌ వల్ల ఈ సౌండ్‌ వస్తుంది. ప్రతీ చక్రం ఈ గ్యాప్‌ని దాటుతున్న క్రమంలో డగ్ డగ్‌ అని శబ్దం వస్తుంది. రైలు వేగాన్ని బట్టి శబ్దాల్లో మార్పులు ఉండనున్నాయి. ఈ గ్యాప్‌కి ఔ సైటింఫిక్‌ రీజన్‌ ఉంది. అందువల్ల శబ్దాలను అరికట్టే సౌలభ్యం ఉండదు.

Train-Track-Sound-Scientific-Reason

రైల్వే ట్రాక్‌లో నిర్ణీత ౩౦౦ నుంచి 500 మీటర్ల మధ్య ఈ జాయింట్‌ ఉంటుంది. దీనివల్ల రైలు వేగాన్ని నియంత్రించేందుకు ఇది ఉపకరించనుంది. లేకపోతే రైలు బ్రేక్‌లు అప్లై చేసినప్పుడు గ్రిప్‌ లభించదు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రైలు చక్రాలను అదుపు చేసేందుకు ఈ గ్యాప్‌ ఉపయోగపడుతుంది. అందుకే గ్యాప్‌ ఉండేలా జాయింట్‌లను ఏర్పాటు చేస్తారని రైల్వే భద్రతా అధికారి ఒకరు తెలిపారు.

ఈ శబ్దానికి మరొక కారణం కూడా ఉంది. రైల్వే ట్రాక్‌లు ఇనుముతో ఉండటం వల్ల వాటిపై నేరుగా సూర్యరశ్మి పడుతుంది. దీంతో రైల్వే ట్రాక్‌లపై వేడి పెరుగుతుంది. ఇనుము సాధారణంగా వేడి చేసినప్పుడు విస్తరిస్తుంది. చల్లగా ఉన్నప్పుడు ఘనీభవిస్తుంది. ఎండల సమయంలో పట్టాలు సాగడం వల్ల రైలు ట్రాక్‌ నుంచి తప్పే ప్రమాదం ఉంటుంది. గ్యాప్ ఉండటం వల్ల బోగీలు లేదా పట్టాలు అదుపు తప్పే అవకాశం తక్కువ ఉంటుంది.

Train-Tracks

ఏదానా ట్రాక్‌లో ఇనుము సాగినా మరో ట్రాక్‌ సరిగ్గా ఉండటం వల్ల ప్రమాదానికి ఆస్కారం ఉండదు. ప్రతీ ట్రాక్‌ని సక్రమంగా ఉండేలా ఈ విధానం ఉపకరిస్తుంది. రైలు పట్టాల మధ్య గ్యాప్‌ లేకపోతే ఒక రైలును మరో రైలు ఢీకొనే అవకాశం ఉంటుంది. రెండు పట్టాల మధ్య చిన్న గ్యాప్ ఉన్నప్పుడు పట్టాలు సాగే స్వభాగం ఉన్నా కానీ వాటిని సకాలంలో సిబ్బంది గుర్తించి ప్రమాదం జరగకుండా చూస్తారు.

అలాగే ట్రాక్‌ కింద ఉండే సిమెంట్ దిమ్మెలకి పట్టాలతో బిగించే భాగం కూడా ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం రైలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పట్టాలు కదిలే అవకాశం ఉంటుంది. దీని కనెక్షన్‌ విరిగిపోకుండా ఉండేందుకు చిన్న గ్యాప్‌ ఇచ్చి గట్టిగా బిగిస్తారు. అందుకే అక్కడ కూడా ఈ గ్యాప్ అనేది గమనించవచ్చు. దీని కారణంగా కూడా శబ్దం వస్తుంది.

పైన తెలిపిన శబ్దాలతో పాటు బ్రిడ్జీలు ఇతర ప్రత్యేకమైన కట్టడాల వద్ద శబ్దం విపరీతంగా వస్తుంది. కొన్నిసార్లు ట్రాక్‌ల వద్ద ఉండే వారికి ఈ శబ్దాలు భయాందోళనకు గురిచేసే అవకాశం ఉంటుంది. గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అంటే అర్థం ఇదే. ఈ సైంటిఫిక్ రీజన్ల కారణంగా శబ్దాలు వస్తాయి. దీనికి సరైన వివరణ లేక చాలా మంది రైలు ప్రయాణించే వేగం వల్ల శబ్దం వస్తుందని భావిస్తారు. దీని వెనక ఉన్న అసలు కారణం ఇది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2024, 8:49 [IST]
English summary
Train track sound scientific reason latest video on this gone viral
Read more on: #off beat #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+