రైళ్లు కదలకుండా ఇనుప గొలుసులతో లాకింగ్.. దానికి ఓ లెక్కుంది!!

రెమాల్‌ తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర కొన్ని ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాన్ తుపాను ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్‌లోని పలు తీర ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తుపాను ప్రభావం నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కట్టుదిట్టమని ఏర్పాట్లను చేసింది.

అందులో భాగంగా ఆ రాష్ట్రంలోని షాలిమార్ రైల్వేస్టేషన్‌లోని రైళ్లను గొలుసులతో పట్టాలను కట్టేశారు. గత వారం రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాన్‌ తుపాను ప్రభావంతో గత రెండు రోజుల్లో అది తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాగ్‌లో ఈ తుపాను తీరం దాటింది. దీనిని నివారించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Trains-Locked-With-Chains

తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు రైల్వే స్టేషన్లలో రైళ్ల చక్రాలను పట్టాలతో లాక్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను ఏఎన్ఐ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గానులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఒకానొక సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ పేర్కొంది. దీంతో పలు రైళ్లు పట్టాలు తప్పి ట్రాకులపై పడిపోయే అవకాశం ఉందని గమనించిన రైల్వే శాఖ అందుకు తగినట్లు తగు జాగ్రత్తలు చేపట్టింది. ఇలా చేయడానికి ఓ సైంటిఫిక్ కారణం ఉంది. తుపాను ప్రభావంతో రైళ్లు పట్టాలు తప్పుతాయని భావించి రైల్వే సిబ్బంది రైళ్లకు గొలుసులు బిగించలేదు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ముందు రైలు ఎలా పార్కు చేస్తారనే విషయంపై అవగాహన ఉండాలి.

Train-Lock

సాధారణంగా మనం ఇంట్లోని వాహనాలను ఏ విధంగా పార్కింగ్‌ ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామో రైల్వే సిబ్బంది కూడా రైళ్లు దెబ్బతినకుండా చూసేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. మన ఇంట్లోని కారు ఎక్కువసేపు కదలకుండా ఉండాలంటే హ్యాండ్ బ్రేక్‌ని వినియోగిస్తాం. కాకపోతే ఆ బ్రేక్ ఎక్కువసేపు ఎంగేజ్ పొజిషన్‌లో ఉంటే బ్రేక్ డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.

అలాగే రైలుని పార్క్ చేసినప్పుడు బ్రేకులు వేయరు. ఎక్కువసేపు బ్రేక్ ఎంగేజ్ అయితే రైలు బ్రేక్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైలును ఒక నిర్దిష్ట స్థానానికి తీసుకెళ్లి ముందుగా బ్రేకులు వేసి ఆపిన తర్వాత ఇనుప సంచులతో రైలుని కదలకుండా చేస్తారు. ఆ తర్వాత చక్రాలను కదలలేని స్థితిలో ఉంచేసి ఆ తర్వాత బ్రేక్ విడుదల చేస్తారు. దీంతో రైలు ఎటు కదలదు.

తాజాగా లాక్‌ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇవి కూడా ట్రైన్‌ని నిలువరించేందుకు రైల్వే శాఖ చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు అని చెప్పవచ్చు. రైలుని ఇనుప గొలుసుతో కట్టేయడం వల్ల అది కదలలేని స్థితిలోకి వెళ్లిపోతుంది. దీంతో గాలులు ఎంత వేగంగా వీచినా రైళ్లలో ఎటువంటి కదలిక ఉండదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ లాకింగ్‌ చర్యతో రైళ్లు పాక్షికంగా దెబ్బతినడాన్ని సైతం నిలువరించవచ్చని ఆయన చెప్పారు.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: వాస్తవానికి ఈ చర్యకు ఇంటర్‌నెట్‌లో భిన్నంగా స్పందించారు. మొదట్లో సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. రైళ్లకు లాక్‌ వేయడం ఏంటని ప్రశ్నించారు. కొందరు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తూ ఎగతాళి చేశారు. అయితే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ చాలా మందికి తెలియదు. తీవ్ర నష్టం వాటిల్లకుండా ఉండాలంటే రైల్వే ఉద్యోగులు ఈ ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2024, 13:59 [IST]
English summary
Trains tied with chains in west bengal ahead of cyclone remal
Read more on: #off beat #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+