విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన హ్యుందాయ్ వెన్యూ.. కారుపై పడిన ట్రాన్స్‌ఫార్మర్
ప్రస్తుతం కార్లను కొనుగోలు చేస్తున్న చాలామంది డిజైన్, మైలేజ్‌తోపాటు మెరుగైన భద్రత ఫీచర్లు ఉన్న కార్ల కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో భద్రతా ఫీచర్లు మాత్రమే రక్షించగలవని చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నారు. కార్లకు ఇతర ఫీచర్ల కంటే భద్రతా ఫీచర్లు ఎంత ముఖ్యమో తాజా ఘటన చూస్తే మీకే అర్థం అవుతుంది.
తాజా ఘటనలో హ్యుందాయ్ వెన్యూ కారు భారీ ప్రమాదానికి గురైంది. ఈ వాహనం రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వాహనానికి ఇదే తొలి భారీ ప్రమాదమని తెలుస్తోంది.

స్థానికుల కథనం ప్రకారం రాయ్‌బరేలీలోని ఓ రహదారిపై హ్యుందాయ్ వెన్యూ వాహనం వేగంగా ప్రయాణం చేస్తుంది. అకస్మాత్తుగా ఓ బైక్.. కారు ముందుకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన హ్యుందాయ్ కారు డ్రైవర్.. బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు తన వాహనాన్ని పక్కకు మళ్లించాడు. దీంతో హ్యుందాయ్ కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
అత్యంత వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగింది. ఫలితంగా స్తంభానికున్న ట్రాన్స్‌ఫార్మర్ కారుపైన పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం బాగా డ్యామేజ్ అయింది. అయితే సరైన సమయానికి కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. దీంతో లోపలున్న ప్రయాణికులు చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

అయితే అంత భారీ ట్రాన్స్‌ఫార్మర్ కారుపైభాగంలో పడినా గానీ.. హ్యుందాయ్ వెన్యూ మెరుగైన బిల్డ్ క్వాలిటీ కారణంగా క్యాబిన్ డ్యామేజ్ కాలేదు. వెన్యూ అప్‌గ్రేడ్‌లో మెరుగైన ఫీచర్లను జోడించింది. వెన్యూ కార్లు ప్రస్తుతం వెనుక సీట్ల కోసం రెండు దశల రీక్లైనర్‌లను కలిగి ఉన్నాయి. మరియు దూర ప్రయాణాల సమయంలో మరింత మెరుగైన సౌకర్యాన్ని కలిగిస్తుంది.
అప్‌గ్రేడ్ చేయబడిన వెన్యూ 60:40 స్ల్పిట్ డిజైన్, మూడు పాయింట్ల సీట్ బెల్ట్, కావాల్సినట్లుగా సర్దుబాటు చేయగలిగిన హెడ్‌రెస్ట్‌లను కూడా కలిగి ఉంది. మరియు హ్యుందాయ్ వెన్యూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ప్రస్తుత రేటింగ్ ప్రకారం అప్‌గ్రేడ్ చేయబడిన హ్యుందాయ్ వెన్యూ పెద్దల భద్రతపరంగా 4 స్టార్ రేటింగ్‌ను పొందింది.
హ్యుందాయ్ వెన్యూ ఆస్ట్రేలియన్ వేరియంట్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ను (AEB) కలిగి ఉంటుంది. రోడ్లపై మనుషులు సహా ఇతర వాహనాలు, పశువులు ఎదురుగా వచ్చినప్పుడు, వెన్యూలో ఉన్న అధునాతన వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ఫలితంగా ప్రమాదం జరగకుండా కాపాడుతుంది.

భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రోడ్డు భద్రతా నిబంధనలు అమలుకావడం లేదు. అందువల్ల రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జంక్షన్లు సహా ఇతర జన సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని తగ్గించి వెళ్లడం ఉత్తమం. జాతీయ రహదారులపైన పలు గ్రామీణ ప్రాంతాల వద్ద సమయం ఆదా చేసేందుకు అనుమతిలేని రోడ్లపై కొందరు ప్రయాణాలు చేస్తుంటారు. మరియు రోడ్లపైకి పశువులు సహా ఇతర జంతువులు వచ్చే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








