ట్రాన్స్‌ఫార్మర్స్ 4 వాహనాలను ఆవిష్కరించిన మైఖేల్ బే
మీరు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా ట్రాన్స్‌ఫార్మర్స్ మూవీ సిరీస్ మాత్రం ఇంకా ముగిసిపోలేదు. వాహనాలు మరమనుషులుగా మారిపోయి శత్రువులతో పోరాడటమే ఈ చిత్రంలో ప్రధానం అంశం. ఇందులో అందమైన కార్లు, వాహనాలు భారీ మరమనుషులుగా మారిపోతాయి. ఈ గ్రాఫిక్స్ మాయాజాలం పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటుంది.
తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు ట్రాన్స్‌ఫార్మర్స్ 4 సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకటి చిత్రాల్లో ఫెరారీ 458, కార్వెట్టే, కమారో నుంచి హమ్మర్ హెచ్2 వరకు వివిధ సూపర్ కార్లు అలాగే జిఎమ్‌సి టాప్‌కిక్ పికప్ ట్రక్కుల నుంచి పీటీర్‍బిల్ట్ 379 హెవీ ట్రక్కుల వరకూ వివిధ వాహనాలను చూశాం. మరి తాజాగా వస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ 4 సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించనున్న వాహనాలేవో వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
ట్రాన్స్‌ఫార్మర్ 4 చిత్రానికి సంబంధించిన ప్రధాన ఫొటోగ్రఫీ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ బే, ట్రాన్స్‌ఫార్మర్ 4లో ప్రధాన పాత్ర పోషించనున్న కొన్ని వాహనాల చిత్రాలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో ఆప్టిమస్ ప్రైమ్ ట్రక్కుకు కూడా స్పెషల్ మేకోవర్ చేశారు. మరి ఆ ఫొటోలను, వాటి విశేషాలను క్రింది ఫొటో ఫీచర్‍లో పరిశీలిద్దాం రండి..!

ట్రాన్స్‌ఫార్మర్స్ 4 వాహనాలను ఆవిష్కరించిన మైఖేల్ బే
ట్రాన్స్‌ఫార్మర్ 4 చిత్రానికి సంబంధించిన ప్రధాన ఫొటోగ్రఫీ ఇప్పటికే ప్రారంభమైంది. నవజో నేషన్ అథిదిగా, రీఎన్విజన్డ్ మరియు రీమోడల్డ్ ఆటోబాట్లను ఆరిజోనా మరియు ఉటాహ్ సరిహద్దు సమీపంలోని మాన్యుమెంట్ వ్యాలీలో ఉన్న హైవే 163పై స్పిన్ కోసం తమ సరికొత్త కాన్వాయ్‌ని తీసుకువెళ్లామని మైఖేల్ బే పేర్కొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్స్ 4 వాహనాలను ఆవిష్కరించిన మైఖేల్ బే
సి7 కార్వెట్టే స్టింగ్‌రే
రేస్ నుంచి స్ఫూర్తి పొంది ఓ ప్రత్యేక సి7 కార్వెట్టే స్టింగ్‌రే కారును 2014లో మార్కెట్లోకి రానున్న ప్రొడక్షన్ వెర్షన్ నుంచి గ్రహించి డిజైన్ చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్స్ 4 వాహనాలను ఆవిష్కరించిన మైఖేల్ బే
బుగాటి గ్రాండ్ స్పోర్ట్ వీటెస్సె
క్లాసీ లుక్ కలిగిన ఈ 1200 హార్స్ పవర్ బుగాటి గ్రాండ్ స్పోర్ట్ వీటెస్సె ధర 24 లక్షల డాలర్లకు పైమాటే.

ట్రాన్స్‌ఫార్మర్స్ 4 వాహనాలను ఆవిష్కరించిన మైఖేల్ బే
ఆప్టిమస్ ప్రైమ్ ట్రక్
ఉత్తర అమెరికాకు చెందిన డైమ్లర్ ట్రక్స్ అందిస్తున్న ఆప్టిమస్ ప్రైమ్ ట్రక్కును ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు.


Click it and Unblock the Notifications








