బంగారం, వెండితో తయారు చేసిన 'ట్రిబ్యూట్' మోటార్‌సైకిల్

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బైక్ ఆషామాషీ బైక్ కాదు. ఇదొక కస్టమైజ్డ్ బైక్, దీని పేరు 'ట్రిబ్యూట్' (TRIBUTE). ఈ బైక్‌ తయారీలో కొన్ని భాగాలను స్వచ్ఛమైనం బంగారం, వెండితో రూపొందించారు. జైపూర్‌‌లోని ట్రాన్సిఫిగర్ కస్టమ్ హౌస్‌కు చెందిన డిజైనర్ అడిల్ డి డుమాసియా ట్రిబ్యూట్ కస్టమ్ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేశాడు. తన డిజైన్లలో గోల్డ్, సిల్వర్‌ను ఉపయోగిస్తూ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్‌ వంటి ప్రముఖులతో పాటు అనేక మందికి ఈయన కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లను తయారు చేసి ఇస్తుంటాడు.

కొన్ని డిజైన్లలో కోఫ్టగిరి వర్క్ కోసం బంగారం, సిల్వర్‌ను ఉపయోగిస్తామని డుమాసియా చెప్పారు. ఈ ట్రిబ్యూట్ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేయటానికి దాదాపు నెల రోజులు పట్టిందని ఆయన చెప్పారు. దీని ఫ్యూయెల్ ట్యాంక్‌పై బంగారంతో చేయబడిన ఆకులు, బంగారం చేసిన ట్రిబ్యూట్ అనే అక్షరాలు ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్, హెడ్ లైట్, సైడ్ మిర్రర్, హ్యాండిల్ బార్, బాడీ ఫ్రేమ్, సైలెన్సర్ కవర్, వెనుక ఫెండర్ గార్డ్, బాడీ డిజైన్‌లలో అక్కడక్కడా బంగారాన్ని ఉపయోగించారు. గడచిన ఆదివారం దీనిని ఒబేరాయ్ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు.

ట్రాన్సిఫిగర్ కస్టమ్ హౌస్‌ అధినేత అడిల్ డుమాసియా మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ వ్యాపారం లోనికి ప్రవేశించడానికి ముందు 16 ఏళ్ల పాటు ఎక్స్ మర్చెంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఆటోమొబైల్స్‌పై ఉన్న ఆసక్తితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. గడచిన సంవత్సరం జరిగిన రైడర్ మానియా 2012 కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్ కార్యక్రమంలో ఈయన నిర్మించిన కస్టమ్ బైక్ మొదటి బహుమతిని గెలుచుకుంది. మరి ఈ ట్రిబ్యూట్ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్ తయారీ ఎలా సాగిందో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

ట్రిబ్యూట్ బైక్ తయారీ

Article Published On: Thursday, March 28, 2013, 10:58 [IST]
English summary
The Customized TRIBUTE was created by designer Adil D Dumasia. He is the owner of Transfigure Custom House. The gas cap of the bike is crafted like a rose and the leaf pattern on either side of the tank have both been gold-leafed and lacquered.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+