మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

భారతదేశంలో 'మోటార్ వాహన చట్టం' చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారు ఎంతవారైనా వదిలేదే లేదని కంకణం కట్టుకున్నారు. ఇటీవల ప్రముఖ తెలుగు డైరెక్టర్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇంతకీ ఈ జరిమానా విధిచడానికి గల కారణం ఏంటి అనే విషయాలను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు కారుకి బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదు. ఈ నిబంధన ఉల్లంగిస్తే ఎంతవారైనా శిక్షార్హులే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సోమవారం రోజున ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఈ బ్లాక్ ఫిల్మ్ వాడినందుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించినట్లు తెలిసింది.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను ఆపడమే కాకుండా అక్కడికక్కడే వాటిని తొలగిస్తున్నారు, అంతే కాకూండా జరిమానా కూడా విధిస్తున్నారు.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

ఇంతకు ముందు కూడా ఈ బ్లాక్ ఫిల్మ్ ఉపయోగిస్తూ పట్టుబడిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ మరియు మంచు మనోజ్ వంటి వారికీ కూడా జరిమానా విధించారు. ఇది కూడా గతంలో లో చాలా హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే వీఐపీలైనా గానీ సెలబ్రెటీలకైనా గానీ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

దీని గురించి జాయింట్ కమీషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ 'ఏవీ రంగనాథ్' మాట్లాడుతూ.. కారు యొక్క విండోస్ పైన ఎటువంటి టింటెడ్ ఫిల్మ్‌ వాడకూడదని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

ఈ బ్లాక్ ఫిల్మ్స్ అనేవి కేవలం 'జెడ్ కేటగిరి' మరియు జెడ్ ప్లస్ కేటగిరికి చెందిన వాహనాలు మాత్రమే వినియోగించాలి. ఇతర వాహనాలు వినియోగిస్తే చర్యలు తప్పవు. భారాతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 'మోటార్ వాహన చట్టం' ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వివిధ సెక్షన్ల కింద తప్పకుండా జరిమానాలు విధిస్తారు. కావున వాహన వినియోగదారులు ఖచ్చితంగా మరియు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

గత నెలలో మెహిదీపట్నంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 'మంచు మనోజ్' కారుకి కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండటం వల్ల పోలీసులు ఆపి రూ. 700 జరిమానా విధించారు. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా కారులోనే ఉన్నారని, పోలీసుల విధి నిర్వహణకు కూడా చాలా సహకరించారని పోలీసులు చెప్పారు.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

సాధారణంగా సినీ ప్రముఖులు మరియు సెలబ్రెటీలు తమకు ఇబ్బంది కలగకుండా ఈ బ్లాక్ ఫిల్మ్స్ ఉపయోగిస్తారు. అలా ఈ బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించకపోతే ట్రాఫిక్ లో సామాన్య ప్రజలు లేదా ఫ్యాన్స్ వారిని గుర్తించడం వల్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే వారు ఈ నియమాన్ని ఎక్కువగా ఉల్లంగిస్తున్నారు. అయితే పట్టుబడిన సమయంలో పోలీసులకు సహకరిస్తున్నారు.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ని తాకిన బ్లాక్ ఫిల్మ్ ఎఫెక్ట్: జరిమానా..!!

బ్లాక్ ఫిల్మ్స్ ఉపయోగించే కార్లలో చాలా సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికి శరమగీతం పాడటానికి సుప్రీం కోర్టు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. అప్పటి నుంచి బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించే కార్లపైన పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే చాలా బ్లాక్ ఫిల్మ్స్ ఉపయోగించిన కార్లపైన పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన సంఘటనల గురించి గతంలో చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే, పాఠకులు గమనించగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 6, 2022, 9:53 [IST]
English summary
Trivikram srinivas fined for violating traffic rules
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+