Truck Break Fails బ్రేక్ ఫెయిల్..10 కార్లను ఢీకొట్టిన ట్రక్కు.. గుట్టలుగా ఏర్పడిన కార్లు, భారీగా ట్రాఫిక్
ముంబైలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ భారీ ప్రమాదంలో తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. వేగంగా దూసుకువచ్చిన ఓ ట్రక్కు మిగతా కార్లు, వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు మీకోసం.
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగిఉన్న వాహనాలను ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. రాయ్ గఢ్ జిల్లాలోని ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వేపై మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ ప్రమాదంలో అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఖోపోలి ఎగ్జిట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ట్రక్కు డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి 10 వాహనాలను ఢీకొట్టాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఊహించని సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్షణాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన తీరుపై కచ్చితమైన వివరాలు తెలియరాలేదు. ట్రక్కు బ్రేకులు ఫెయిలవ్వడమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు పక్కకు కదల్లేని స్థితిలో ఉన్న విజువల్స్ గమనించవచ్చు. ప్రమాద సమయంలో ట్రక్కు అతివేగంగా ఉండటం.. సడెన్‌గా బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వేలో ఎక్కువగా ఘాట్ సెక్షన్లలపై ఉన్న వంపుల కారణంగా ట్రక్కు దిగువ భాగంలోకి వస్తుండగ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అదే వేలో ఉన్న కార్లను ట్రక్కు ఢీకొట్టి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో పెద్దగా గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, వారిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అనంతరం ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ యాక్సిడెంట్‌లో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
దూర ప్రాంతాలకు వెళ్తున్న ట్రక్కులకు బ్రేక్ ఫెయిల్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో టోల్ గేట్ వద్ద వేచి ఉన్న నాలుగు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడం కిందవైపు వంపు ఎక్కువ ఉండటంతో డ్రైవర్ దాన్ని అదుపుచేయలేక పోయాడు.

ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని, ట్రక్కును ఢీకొట్టిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానికులు చెప్పారు. ఎయిర్ బ్రేకులను సాధారణంగా భారీ వాహనాలు మరియు ట్రక్కులలో ఉపయోగిస్తారు. ట్యాంకుల్లో నిల్వ చేసిన కంప్రెస్డ్ గాలి ద్వారా వీటిని ఉపయోగిస్తారు. వాహనం ఇంజన్ కంప్రెసర్ కు శక్తినిస్తుంది. ఇది ట్యాంకులను కంప్రెస్డ్ గాలితో నింపుతుంది.
కొంతమంది ట్రక్ డ్రైవర్లు ఇంధనాన్ని ఆదా చేయడానికి దిగువకు డ్రైవింగ్ చేసేటప్పుడు వారి ఇంజన్‌ని స్విచ్ ఆఫ్ చేయడానికి ఎంచుకుంటారు. దీనివల్ల ఎయిర్ కంప్రెసర్ పనిచేయడం ఆగిపోతుంది. ట్రక్కులలో ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సాధారణంగా ఉపయోగించబడనప్పటికీ, బ్రేకుల కోసం ఇంజన్ శక్తిని ఉపయోగిస్తారు.

వాణిజ్య వాహనాల ఓవర్లోడ్ భారతదేశంలో ప్రధాన సమస్యగా ఉంది. దీని ఫలితంగా రోడ్లపై ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదనపు లోడ్ వల్ల ఇంజన్ పై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అది ట్రక్కు జీవితకాలాన్ని తగ్గిస్తుంది. రహదారిపై వీటితో ఇతర వాహనదారులకు ఎప్పుడు ముప్పు ఉంటూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications








