ఇంటర్నెట్‌ని షేక్ చేసిన లారీ డ్రైవర్! యూట్యూబ్‌తో ఇప్పుడు స్కార్పియో ఓనర్.. ఎవరూ ఊహించని జర్నీ!

ఈ రోజుల్లో సోషల్ మీడియా సాధారణ జీవితాలను గడుపుతున్న వారిని కూడా ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మార్చి వేస్తుంది. ఇలాంటి వారి గురించి ఇటీవలి కాలంలో వింటూనే ఉన్నాం. అలాంటి కోవకే చెందిన వారు, రాజేష్ రావణి. రెండు దశాబ్దాల పాటు లారీ డ్రైవర్‌గా జీవితం గడిపిన ఆయన, ఒక్క యూట్యూబ్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయారు. ఆయన సాధారణంగా లారీ డ్రైవింగ్ చేసేవారు. రాజేష్‌కు వంట మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించాడు. మొదట్లో తన ట్రక్ ప్రయాణాల్లో వంట చేసుకుంటూ, దాన్నంతా కూడా వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. అవి ఎంతో సహజత్వంతో ఉండేవి. అతని మాటలు, నడక, వంట విధానంతో చాలా మందిని అట్రాక్ట్ చేశారు. దీంతో ఆయన ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం క్రమంగా పెరిగిపోయింది.

ఒక్కో వీడియోతో రాజేష్ ప్రజాదరణ పొందుతూ వచ్చారు. తన ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు, ఆయనకి సమాజం నుంచి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇప్పుడు ఆయన్ని కేవలం ఓ లారీ డ్రైవర్‌గా కాదు, ఒక సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌గా చూస్తున్నారు. యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. పని ఎప్పుడూ మారకపోవచ్చు, కానీ ఆ పనిలోనే కొత్త మార్గాలను అన్వేషించవచ్చు అనే విషయాన్ని రాజేష్ జీవితం చెబుతోంది.

Truck Driver And Youtuber Rajesh Rawani

తన ఛానెల్ క్రమంగా ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టిన ఆయన మెల్లగా తన కలలను సాకారం చేసుకుంటున్నాడు. తాజాగా, రూ.21.72 లక్షల(ఎక్స్ షోరూమ్) కలిగిన మహీంద్రా స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ SUVను కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనుచరులతో ఆనందంగా పంచుకున్నారు. ఈ కొత్త SUV డెలివరీ తీసుకుంటున్న వీడియోను ఆయన యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, అది రెండు రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

అంతే కాదు, ఈ కారుకు JH 01 GD 7777 అనే వీఐపీ నంబర్ ప్లేట్ కూడా తీసుకున్నారు. ఇది అతని కలలు నెరవేరిన గుర్తుగా నిలుస్తోంది. మరో విషయం ఏమిటంటే, ఇప్పటికే ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేశారు. అంటే, చిన్న కంటెంట్‌తో కెరియర్‌‌కి మొదటి అడుగులు వేసిన వ్యక్తి, ఇప్పుడు అన్ని విధాలుగా ఎదుగుతున్నాడని చెప్పొచ్చు.

Youtuber Rajesh Rawani Buys New Car

వ్లాగింగ్ అనే సింపుల్ మార్గాన్ని ఎంచుకుని, చాలా కాలం ట్రక్కు నడిపిన జీవితాన్ని మార్చేసిన ఆయన, ఇప్పుడు లక్షల మందికి స్ఫూర్తిగా మారారు. ఈ క్రమంలో ఆయన కొనుగోలు చేసిన కారు గురించి చాలా మంది ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తన జీవితం మారిపోయిన ఈ ట్రక్ డ్రైవర్‌కి, ఇప్పుడు అతని గ్యారేజీలోకి మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ SUV వచ్చి చేరింది.

స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ SUVలో మీరు మీ డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా మాన్యువల్ గానీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గానీ ఎంచుకోవచ్చు. ప్రత్యేకంగా డీజిల్ వేరియంట్లలో 4x4 డ్రైవ్ సిస్టమ్ (4WD), రియర్-వీల్ డ్రైవ్ (RWD) ఫార్మాట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

Truck Driver And Youtuber Rajesh Rawani Mahindra Scorpio

స్కార్పియో వేరియంట్‌లో ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, డ్రైవర్ డ్రైబినెస్ డిటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు వంటి మరిన్ని భద్రతా అంశాలు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2025, 17:24 [IST]
English summary
Truck driver and youtuber rajesh rawani buys new mahindra scorpio n carbon edition
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+