3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

వాహనాలకు బ్రేకులు పనిచేయకపోతే దాని వల్ల వచ్చే ప్రమాదం ఊహాతీతం. బ్రేకులు పనిచేయనప్పుడు వాహనదారుడు కూడా వాహనాన్ని కంట్రోల్ చేయలేడు, ఈ సమయంలో వాహనదారుడు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలలో ఉన్నవారు కూడా ప్రమాదంలో పడతారు. కానీ ఇటీవల ఒక ట్రక్ డ్రైవర్ ఎంతో నైపుణ్యంతో బ్రేకులు పనిచేయని ట్రక్కును ప్రమాదం జరగకుండా నడిపాడు.దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

అకస్మాత్తుగా బ్రేక్‌లు విఫలమ్ కావడం వల్ల ఒక డ్రైవర్ ట్రక్కును రివర్స్ గేర్‌లో సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిపాడు. చివరికి అతను ట్రక్కును విజయవంతంగా ఆపగలిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోను ఇటీవల ట్రాన్స్‌పోర్ట్ లైవ్ అనే యూట్యూబ్ ఛానెల్ విడుదల చేసింది.

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్నా - సిల్లోడ్ రహదారిలో జరిగింది. ట్రక్కుకి బ్రేకులు పనిచేయకపోవడంతో, డ్రైవర్ వాహనాన్ని సురక్షితంగా ఆపడానికి రివర్స్ గేర్‌లో ట్రక్కును నెమ్మదిగా నడిపాడు. ట్రక్ రివర్స్ గేర్‌లో వెళుతున్నప్పుడు కొంతమంది దానిని అనుసరిస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు.

MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

వీరిలో కొందరు ట్రక్కు పరిస్థితి గురించి ఇతర వాహనదారులను హెచ్చరిస్తూ కొంతవరకు ట్రాఫిక్ క్లియర్ చేశారు. బ్రేక్‌లు పని చేయనప్పుడు, ఇతర వాహనదారులకు హాని కలిగించకుండా ట్రక్కును నడపడం అంత సులభం కాదు. కానీ ట్రక్ డ్రైవర్ ఇంత కష్టతరమైన పనిని జాగ్రత్తగా నిర్వహించగలిగాడు.

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

సాధారణంగా చిన్న టైర్లతో పోలిస్తే పెద్ద టైర్లు వేగంగా వెళ్ళేటప్పుడు చాలా సులభంగా రోల్ అవుతాయి. ఈ కారణంగా ట్రక్కు వేగం తగ్గలేదు. చివరకు ట్రక్కు డ్రైవర్ ఒక బహిరంగ ప్రదేశాన్ని చూసి స్టీరింగ్ వీల్‌ను దాని వైపుకు తిప్పాడు. ఈ విధంగా చేయడం వల్ల ట్రక్కు యొక్క వేగం తగ్గించగలిగాడు.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ట్రక్కు డ్రైవర్ చేసిన ఈ పని వల్ల ఎట్టకేలకు ట్రక్ నిలిచిపోయింది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం మనలో మొదలవుతుంది. కానీ ట్రక్కు డ్రైవర్ ఎంతో నేర్పుతో వ్యవహరించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడగలిగాడు.

వాహనాలను నడుపుతున్నప్పుడు ఎదురయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో బ్రేక్ విఫలం కావడం ఒకటి. భారతీయ రోడ్లపై ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు 1.50 లక్షలు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా ప్రమాదాలు జరగటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

వాహనంలో బ్రేకులు అకస్మాత్తుగా పనిచేయకపోతే, వాహనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఈ సమయంలో ప్రమాదం జరుగుతుంది. ఇటీవల తమిళనాడులో కూడా వాహనానికి బ్రేక్స్ విఫలం కావడం వల్ల లారీ ఢీ కొట్టింది. కానీ అదృష్టవశాత్తూ అక్కడ ఉన్న ఇద్దరు యువకులు తప్పించుకోగలిగారు. వాహనానికి బ్రేక్స్ చాలా ముఖ్యం. కాబట్టి వాహనం యొక్క బ్రేకులు సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలి.

Most Read Articles

English summary
Truck Driver Drives Truck In Reverse Gear For 3 Kilometres. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X