Truck Falls on Car టర్నింగ్‌లో ట్రక్కు బీభత్సం.. కారు నుజ్జునుజ్జు.. వీడియో వైరల్‌

భారత్‌లోని రహదారులపై డ్రైవింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. ఓ వైపు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడుతున్నా.. అంతకంతకూ ర్యాష్ డ్రైవింగ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. సీసీ కెమెరాలు, సామాజిక మధ్యమాల ద్వారా ప్రమాదాలకు సంబంంధించి సమాచారం మొత్తం అరచేతిలో వాలుతోంది.

వాహనం నడిపేవారి అజాగ్రత్త లేదా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో రోడ్లపై ఓ వైపు ర్యాష్‌ డ్రైవింగ్‌తో పాటు పశువులు, వీధికుక్కలు, వాకర్లు మరియు రోడ్డుకు రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసే వ్యక్తులను ఎదుర్కోవడం కూడా డ్రైవర్లకు సవాలుగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. తాజాగా హిమాచల్‌ ప్రదేశల్‌ ఓ ప్రమాదం వీడియో వైరల్‌గా మారింది..

Truck Falls on Car

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీపై ట్రక్కు పడిపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ వీడియోను ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీడియోలోని సమాచారం ప్రకారం బొగ్గుతో కూడిన ట్రక్కు హ్యుందాయ్ క్రెటాపై పడింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వీడియోలో ప్రమాదం జరిగిన అనంతరం సంఘటనలు మాత్రమే రికార్డు చేయబడ్డాయి.

ఘటనలో రహదారికి ఒకవైపు పడిపోయిన ట్రక్కును వీడియోలో చూడవచ్చు. హిమాచల్ ప్రదేశ్ పర్వతాలతో కూడిన రాష్ట్రం. అంతే కాకుండా ఈ ప్రాంతంలోని అనేక రహదారులు ఇరుకైనవే కాక ప్రమాదకర వంపులు కలిగి ఉంటాయి. ప్రమాదం తీరు చూస్తుంటే ట్రక్ డ్రైవర్‌దే తప్పు అని అర్థమవుతోంది. బొగ్గుతో వెళ్తున్న లారీని నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో నడపడమే ఇందుకు కారణంగా స్థానికులు తెలిపారు.

Truck Falls on Car

రహదారిపై ఓ వైపుగా హ్యుందాయ్‌ కెటా కారు ఉంది. ఆ సమయంలో భారీ బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్ ఒక మలుపు వద్దకు చేరుకోగానే దానిని అదుపు చేయలేకపోవడంతో ట్రక్కు కుడివైపునకు వంగి.. ఏకంగా హ్యుందాయ్‌ కెటా కారు మీద పడిపోయింది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరగగా.. ట్రక్ ఒరిగిపోవడంతో, హ్యుందాయ్ క్రెటా డ్రైవర్‌తో పాటు ట్రక్కు కింద చిక్కుకున్నారు.

హ్యుందాయ్ క్రెటా పూర్తిగా ట్రక్కు కింద నలిగిపోయిందని వీడియో ద్వారా తెలుస్తోంది. ట్రక్కు వెనుక ఉన్న వస్తువుల బరువు కారణంగా, SUV పైకప్పు పూర్తిగా కూలిపోయింది. వెనుక చక్రం మాత్రమే బయట కనిపిస్తోంది. హెవీ డ్యూటీ క్రేన్‌ను ఉపయోగించి ట్రక్కును పైకి లేపారు. అదృష్టవశాత్తు హ్యుందాయ్ క్రెటా డ్రైవర్‌ను ప్రాణాలతో బయటపడ్డారు.

Truck Falls on Car

ఎస్‌యూవీ, ట్రక్కు మధ్య కనీసం 3 గంటల పాటు డ్రైవర్‌ ఇరుక్కుపోయారు. ప్రమాదం నుంచి ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. హ్యుందాయ్‌ క్రెటా ఎస్‌యూవీ విషయానికొస్తే, ప్రమాదంలో ఈ కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం అనంతరం కారు బంపర్ దూరంగా ఎగిరిపడింది. హ్యుందాయ్ క్రెటాపై పడిన ట్రక్కు పక్కనే మరో ట్రక్కు ఉంది. ప్రమాదానికి ఈ ట్రక్కు కూడా కారణమా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఇలాంటి భారీ వాహనాలు నడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయకూడదు. ముఖ్యంగా లోడ్‌తో వెళ్తున్నప్పుడు అటువంటి వాహనంపై నియంత్రణను నిర్వహించడం చాలా కష్టం. మీరు ఎప్పుడైనా భారీ వాహనం వెనుక ఉన్నట్లయితే, ఎల్లప్పుడూ సురక్షితమైన దూరాన్ని పాటించడంతో పాటు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే ముందు ట్రక్ డ్రైవర్ నుండి చేతి సంకేతాల కోసం వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, May 29, 2023, 17:36 [IST]
English summary
Truck falls on hyundai creta car driver escapes safely video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+