థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం
కోట్ల ఖరీదు చేసే అత్యంత అరుదైన మరియు విలాసతవంతమైన కార్లు యాక్సిడెంట్‌లో దెబ్బతిన్నా లేక అగ్నికి ఆహుతైనా చూసేవారికి అయ్యో అనిపిస్తుంది. అలాంటిదే ఓ సంఘటన థాయ్‌లాండ్‍లో చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఓ పెద్ద ట్రక్కు నిండుగా సూపర్ కార్లు అగ్నికి ఆహుతైపోయాయి. థాయ్‌లాండ్‍లోఖరీదైన కార్లను తరలిస్తున్న ఓ ట్రక్కులో అగ్నిప్రమాదం జరిగింది, అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపుగానే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఓ ఫెరారీ 430, లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి640, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కార్లతో పాటు మరో రెండు లగ్జరీ కార్లు కూడా కాలి బూడిదైపోయాయి. ఈ సూపర్ కార్ల బాడీని కార్భన్ ఫైబర్ మెటీరియల్‌తో డిజైన్ చేయటంతో మంటలు అత్యంత వేగంగా వ్యాపించి, క్షణాల్లో కార్లను బుడిదగా మార్చేశాయి.
ఈ ప్రమాదంలో జరిగిన మొత్తం నష్టం సుమారు 100 మిలియన్ భాట్స్ (ఇది 33.13 లక్షల డాలర్లు లేదా రూ.18,62,65,591 లకు సమానం). మరి ఈ ఘోర అగ్నిప్రమాదాన్ని చిత్రాలు, వీడియో ద్వారా మనం కూడా తిలకిద్దాం రండి. (చివరి స్లైడ్‌లో వీడియోని వీక్షించవచ్చు).

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం

థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం
థాయ్‌లాండ్‌లో భగ్గుమన్న లగ్జరీ కార్లు, కోట్లలో ఆస్తి నష్టం
వీడియో

Click it and Unblock the Notifications