వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటైన 'హ్యుందాయ్' (Hyundai) దేశీయ మార్కెట్లో 'ఎక్స్‌టర్‌' (Exter) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారు ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ ఇప్పటి వరకు ఎక్కడా ప్రమాదాలకు గురి కాలేదు. అయితే ఇటీవల ఓ భారీ ట్రక్కు ఈ ఎక్స్‌టర్‌ కారును డీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయినప్పటికీ.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

Hyundai-Exter-Accident

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. కానీ రోడ్డుపైన ఒక ట్రక్కు.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ కారును వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఎక్స్‌టర్‌ రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కొంత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. ఇది ఎక్స్‌టర్‌ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ అని తెలుస్తోంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ విషయానికి వస్తే.. ఇది దేశీయ మార్కెట్లో ఉత్తమమైన అమ్మకాలు పొందిన మైక్రో SUV 'టాటా పంచ్'కు ప్రత్యర్థిగా భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. దీని (హ్యుందాయ్ ఎక్స్‌టర్‌) ధరలు మార్కెట్లో రూ. 6 లక్షల నుంచి రూ. 10.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న కారు అని తెలుస్తోంది.

Hyundai-Exter-Accident

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో 1.2-లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తోంది. ఇది 81.8 Bhp పవర్ మరియు 113.8 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ యొక్క CNG వెర్షన్ 67.7 Bhp పవర్, 95.2 Nm టార్క్ అందిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ యొక్క పెట్రోల్ వేరియంట్ 19.2 కిమీ/లీ నుంచి 19.4 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. CNG వేరియంట్ 27.1 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు 8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

Hyundai-Exter-Accident

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (TPMS), సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కాబట్టి ప్రమాదంలో కూడా ప్రయాణికులు భద్రతను పొందగలరు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

Embed code :

More from DriveSpark

Article Published On: Thursday, April 25, 2024, 13:11 [IST]
English summary
Truck hits hyundai exter on highway video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+