వెనుక నుంచి కారును వేగంగా ఢీకొట్టిన ట్రక్కు.. ఆ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మృతి
మారుతి డిజైర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్. కొనుగోలుదారులు ఎక్కువగా ఈ కారును ప్రైవేట్ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం కొనుగోలు చేస్తారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది పేలవంగా పనిచేసినప్పటికీ.. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలో ఉండటంతో ఎక్కువగా మారుతి బ్రాండ్లపై కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే ఇటీవలి జరిగిన ప్రమాదంలో మారుతి డిజైర్ తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం సీటు బెల్ట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. హైవేపై మారుతీ డిజైర్ కారు నలుగురితో వెళ్తుండగా.. అకస్మాత్తుగా రోడ్డుపై కారును ఆపాడు. దీంతో ఇది గమనించని వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. కారులో ఉన్నవారిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే, కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్‌బెల్ట్ ధరించకపోయినా.. లేదా స్పీడ్ లిమిట్‌కు మించి డ్రైవ్ చేసినా.. ఎలాంటి భద్రతా రేటింగ్, సేఫ్టీ ఫీచర్లు మిమ్మల్ని కాపాడలేవని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా, మారుతి తన తాజా కార్ల నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాగా అంతకు ముందు మారుతీ కార్లు కొన్న వారి పరిస్థితి ఏమిటనేది చెప్పలేం.
ఈ ప్రమాద వీడియోను నిఖిల్ రానా అనే వ్యక్తి యూట్యూబ్‌లో షేర్ చేశారు. వీడియోలోని సమాచారం ప్రకారం, హైవేపై మారుతీ డిజైర్‌లో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా, కొన్ని కారణాల వల్ల, డ్రైవర్ రోడ్డుపై ఆపవలసి వచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్కు కారును వెనుక నుంచి ఢీకొట్టింది. వెనుక భాగం పూర్తిగా ధ్వసం కాగా.. ముందు భాగంలో ఎలాంటి డ్యామేజ్ కాలేదు.

దురదృష్టవశాత్తు డ్రైవర్, ఫ్రంట్ సీట్లో కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌తో పాటు ముందు కూర్చున్న మరో ప్రయాణీకుడు సీటు బెల్ట్ ధరించలేదని సమాచారం. అదే ప్రమాదంలో వారు మృతి చెందడానికి కారణం కావచ్చు. ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
మారుతీ సుజుకి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. భారీ డీలర్‌షిప్ మరియు సర్వీస్ నెట్‌వర్క్, అధిక మైలేజీ, మంచి ఇంజిన్లు, తక్కువ నిర్వహణ, అధిక విశ్వసనీయత మరియు ఆకర్షణీయమైన ధరల కారణంగా కంపెనీ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే గ్లోబల్ NCAP పరీక్షలో మాత్రమే మంచి స్కోర్ కోసం మారుతి కార్లు చాలా కష్టపడుతున్నాయి.

ఈ క్రమంలో మారుతి.. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి దృష్టి పెట్టవలసి ఉంది. డిజైర్ ఆధారంగా థర్డ్-జెన్ స్విఫ్ట్ గ్లోబల్ NCAPలో బాగా రాణించలేదు. దీనిపై అందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ కార్లలో ప్రజలు తమ భద్రత గురించి నమ్మకంగా ఉండేలా మారుతి ఈ అంశంపై కృషి చేస్తూనే ఉంది.
రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రహదారి భద్రతకు భరోసా ఇవ్వడంలో వాహనదారులు మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను అలవరచుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








