కారును ఢీకొట్టిన ట్రక్కు.. ప్రమాదంలో చాకచక్యంగా తప్పించుకున్న తాత, డ్యాష్‌క్యామ్ వీడియో వైరల్
టాటా టియాగో కారును ట్రక్కును ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈ యాక్సిడెంట్ జరుగుతున్న సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఎక్కడ జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవతూ ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తున్నారు. ఈ కారణంగా ఆటో మొబైల్ రంగంలో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు.

కార్లలో బిల్ట్ క్వాలిటీ నిర్మాణ పరంగా దేశీయ బ్రాండ్ టాటా కార్లు విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. నిర్మాణ నాణ్యత కారణంగా ఘోరమైన ప్రమాదాల సమయంలోనూ టాటా కార్లు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ టాటా టియాగో NRG కారులోని డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. హైవేపై Tata Tiago NRG కారు వెళ్తుండగా లేన్ నుంచి ఎదురుగా ట్రక్కు వస్తోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా కారును ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఆ ట్రక్కు పక్కనే ఓ వృద్ధుడు సైకిల్‌పై వస్తున్నాడు.

యూపీలోని ఓ రెండు లేన్ల హైవేపై కారు ప్రయాణిస్తోంది. వీడియోను పరిశీలించినట్లయితే అక్కడ సంఘటన జరిగే సమయానికి ముందు వర్షం పడినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై పక్కన అజాగ్రత్తగా బస్సు నిలపడాన్ని చూడవచ్చు. దీని ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించే అవకాశం లేదు.
దీంతో టియాగో డ్రైవర్ బస్సు దగ్గరకు రాగానే, అకస్మాత్తుగా ఓ మినీ ట్రక్కు దానిని ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించింది. అయితే అదృష్టవశాత్తు కారు డ్రైవర్ సమయానికి బ్రేకులు వేయడంతో ట్రక్కు పక్క నుంచి వెళ్లిపోయింది. ట్రక్కు పక్కనే సైకిల్‌పై వస్తున్న వృద్ధుడు కూడా సమయస్ఫూర్తితో బ్రేకులు వేసి పక్కకు జరిగాడు.

ఆ ట్రక్కు వెంబడే టాటా సుమో పోలీసు వాహనం, మరో లారీ రావడాన్ని వీడియోలు చూడవచ్చు. అయితే రోడ్డు పక్కనే బస్సును ఆపి ఉంచడంతో ట్రక్కును పక్కకు మళ్లించడానికి డ్రైవర్‌కు స్థలం దొరక్కపోవడంతో టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ కారును ఢీకొట్టాల్సి వచ్చింది. దీంతో కారు విండో ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. సంఘటనలో డ్రైవర్ సైడ్ డోర్, విండో దెబ్బ తిన్నాయి.
కాగా ఈ సంఘటనలో టాటా టియాగో డ్రైవర్ సమయస్ఫూర్తిని మెచ్చుకోవచ్చు. అదే సమయంలో కారుకు ఎదురుగా సైకిల్‌పై వృద్ధుడు వస్తున్నాడు. కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో సైకిల్‌ను ఢీకొట్టకుండా పక్కకి తప్పించాడు. దీంతో అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు.

ఇక టాటా టియాగో NRG కారు విషయానికొస్తే.. ఇది అన్ని ఇతర టాటా కార్ల మాదిరిగానే గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మంచి స్కోర్‌ను సాధించింది. క్రాష్ టెస్ట్‌లో టియాగో, టిగోర్ సెడాన్ కార్లు 4 స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భాల్లో టాటా కార్లు తమ నిబద్ధతను చాటుకున్నాయి.


Click it and Unblock the Notifications








