పాక్ నూతన ప్రధాని కాన్వాయ్‌లోని ఆ 6 మెర్సిడెస్ మేబ్యాక్ కార్ల వెనుకున్న అసలు కథ ఇదీ!!

పాకిస్తాన్ నూతన ప్రధాని మరియు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అధికారిక కాన్వాయ్‌లోకి వచ్చిన చేరిన అత్యంత విలాసవంతమైన ఆరు కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 సెడాన్ కార్ల గురించిన వార్తలు ఇటీవల వైరల్ అయ

By Anil Kumar

పాకిస్తాన్ నూతన ప్రధాని మరియు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అధికారిక కాన్వాయ్‌లోకి వచ్చిన చేరిన అత్యంత విలాసవంతమైన ఆరు కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 సెడాన్ కార్ల గురించిన వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదని, ఈ ఆరు మేబ్యాక్ కార్ల వెనకున్న అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ కొత్తగా ఎన్నికైన పాక్ ప్రధాని ఈ విమర్శలను ఎందుకు ఎదుర్కున్నాడో చూద్దాం రండి...

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఎన్నికయ్యాక, తన అధికారిక కాన్వాయ్ కోసం ఆరు అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 అల్ట్రా-లగ్జరీ సెడాన్ కార్లను కొనుగోలు చేశాడనే వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, అతి తక్కువ వ్యవధిలో ఇంటర్నెట్ మొత్తం వ్యాపించాయి.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

అతి తక్కువ కాల వ్యవధిలో ఇలా ఖర్చుపెట్టడాన్ని సహించలేకపోయిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. భవిష్యత్ ప్రధాని యొక్క అడ్డూఅదుపులేని ఖర్చు చేశారని మండిపతే, మరికొందరు మాత్రం ఈ కార్లను స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం వేలం వేస్తారని విమర్శించారు.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

ఏదేమైనప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ ఆరు లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడనే ఆరోపణలకు సంభందించిన అనుమానాలను నివృత్తి చేసే కథనం ఒకటి తాజాగా ఆన్‌లైన్‌లో కనబడింది. వివరాల్లోకి వెళితే...

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

ఈ కథనం మేరకు, మొదటి ఈ కార్లను పాకిస్తాన్ ప్రధాని కోసం దిగుమతి చేసుకున్న కార్లు కాదు. రెండవది, ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఆరు విలాసవంతమైన ఇంపోర్టెడ్ కార్లను వేలం వేస్తారనే కథనం స్పష్టత లేదు.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

నిజానికి ఈ ఆరు కార్లు ఇప్పట్లో కొనుగోలు చేసినవి కాదు, జర్మనీకి చెందిన ఈ హై ఎండ్ కార్లను, 2016లో జరిగిన సార్క్ సర్వసభ్య సమవేశాలలో పాల్గొనాల్సిన సార్క్ సభ్యులు మరియు ఇతర అధికారులు కొనుగోలు చేశారు.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

అయితే చాలా వరకు దేశాలు సార్క్ సమావేశంలో పాల్గొనకుండా బహిష్కరించడంతో అనుకోకుండా ఈ సమావేశం రద్దయిపోయింది. దాంతో ఈ ఆరు కార్లను నిరూపయోగంగా మారిపోయి, ప్రధాని మంత్రి అధికారిక వాహన శ్రేణిలో ఉన్న 80 ఇతర పాత కార్లలో భాగమైపోయాయి.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

వీటిలో ఏ ఒక్క కారును కూడా ఉపయోగించలేదు. అంతే కాకుండా, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ కార్లను ఉపయోగిస్తుందనే విషయం కూడా తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ, జర్మన్ లగ్జరీ కార్లను ఎట్టకేలకు వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటిని ప్రధాని మరియు ఇతర సీనియర్ పొలిటికలర్ లీడర్లు వినియోగిస్తారనే వార్తలొస్తున్నాయి.

పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్

ఏదో అవసరానికి, ఎప్పుడో కొనుగోలు చేసిన కార్లు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టాయి. కార్ల విషయానికి వస్తే, ఒక్కో మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 పుల్‌మ్యాన్ గార్డ్ కారు ధర సుమారుగా రూ. 10 కోట్లకు పైమాటే. సాంకేతికంగా ఇందులో 4.0-లీటర్ సామర్థ్యం గల వి12 బై-టుర్భో పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 621బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Read In Telugu: Truth Behind New Pakistan PM’s 6 New Mercedes-Maybach Luxury Sedans
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X